English   

తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డులు...వీరికే

Kalaimamani-awards
2019-03-01 10:33:37

తమిళనాడు ప్రభుత్వం దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. త్వరలో అవార్డులు వచ్చిన వారికి అందరికీ ముఖ్యమంత్రి త్వరలో అవార్డులు అందచేయనున్నారు. సాహిత్యం, కళా రంగాల్ల్లో విశిష్ట సేవ చేసిన వారికి తమిళనాడు అయాల్ ఇసాయి నాటక మండ్రం ఈ అవార్డులని ప్రకటించనుంది. నటులు విజయ్ సేతుపతి, కార్తీ, నటి ప్రియమణి, మ్యూజిక్ డైరెక్టర్ యువన్‌శంకర్ రాజా, డైరెక్టర్ శశికుమార్‌, హరి, రత్నవేలు, ఏఎం రత్నం,  తదితరులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఎనిమిదేళ్లకు గానూ 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేయడం విశేషం.  2013కి గానూ కార్తీకి కళైమామణి పురస్కారం వరించగా.. 2017కి గానూ విజయ్‌సేతుపతి ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. భాషా డైరెక్టర్ సురేశ్ కృష్ణకు కూడా ఈ అవార్డు వరించింది. హాస్య నటుడు సంతానం కూడా పురస్కారాన్ని అందుకోనున్నారు.  ఈ అవార్డులకు ఎంపికైన వారికి ప్రశంసాపత్రం, లక్ష రూపాయల నగదు అందజేస్తారు. 1968 నుంచి ఈ అవార్డులను ఇస్తున్నారు. గతంలో కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ కాంత్, ఇళయరాజా తదితర ప్రముఖులకు ఈ అవార్డులు అందజేశారు. 
2011 : ఆర్ రాజ శేఖర్, పీ రాజీవ్ , కుట్టి పద్మిని, పీ పండు, పులియర్ సరోజ, బీఎస్ శశిరేఖ, పీ కాసీ
2012: ఎసేస్ సేమ్బగముట్టు, రాజశ్రీ, వరలక్ష్మి, ప్లేబ్యాక్ గాయకుడు గనా ఉలగనాథన్, దర్శకుడు చిత్రా లక్ష్మణన్ మరియు సినిమాటోగ్రాఫర్ బాబు అలియాస్ ఎన్ వి ఆనందకృష్ణన్,
2013:ప్లేబ్యాక్ గాయకుడు ఆర్ కృష్ణరాజ్, పరవై మునియమ్మ, టి వెల్మరుగన్, నటులు: ప్రసన్న, నళిని, 
పాండ్య రాజ్యాన్, కుమారి కాంచనా దేవి, శారద, గజేంద్రన్, స్టంట్ మాస్టర్ జూడో రత్నం, 
2014: పొన్వన్నన్, దర్శకుడు సురేష్ కృష్ణ, నేపథ్య గాయకుడు మాలతి మరియు కొరియోగ్రాఫర్ ఎన్ ఎ తారా 2015: 
మధు బాలాజీ, ప్రభాపువా దర్శకుడు: ఎ ఎన్ పవీధ్రన్, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ, పాటల రచయిత యుగభారతి, సినిమాటోగ్రాఫర్ ఆర్ రతినావళు, నేపథ్య గాయని గనా బాల,
2016: విజయ్ సేతుపతి, ప్రియమణి, సింగమూతు, దర్శకుడు హరి, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, నిర్మాత కలైంగణం, ఫోటోగ్రఫి శేషాద్రి నాథన్ సుగుమారన్, రవి తదితరులు నటించారు.
2018: శ్రీకాంత్, సంతనం, నిర్మాత ఎ. ఎం. రత్నం, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్, ప్లేబ్యాండ్ ఐం ఉన్ని మీనన్.

More Related Stories