English   

సర్జికల్ స్ట్రైక్ మీద సినీ ఇంట్రెస్ట్ !

Surgical-Strikes
2019-03-01 11:35:09

అదేదో అనేవారు పాత సామెత సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని, దేశం మొత్తం పుల్వామా ఘటన జరిగి నలభై మంది వీర జవాన్లను పోగొట్టుకున్న బాధలో ఉంటె శవాల మీద పేలాలు ఏరుకునే చందాన కొందరు సినిమా వాళ్ళు ఆ ఘటనల ఆధారంగా సినిమాలు తీయడానికి పోటీ పడుతున్నారు. పుల్వామా దాడికి మన ప్రభుత్వం చేసిన సర్జికల్ స్ట్రైక్ ఘటనల మీద సినిమాలు తీసేందుకు బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట. పుల్వామా ఉగ్రదాడి, అనంతరం భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్ 2 ఘటనలపై వచ్చిన వార్తలు చూసేందుకు ప్రజలు న్యూస్ చానెళ్ళకే అతుక్కుపోయి టీవీ చానెళ్ళ టీఆర్పీ పెంచేశారు. ఈ నేపధ్యంలో వీటిని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న కొందరు నిర్మాతలు బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్, పుల్వామా ఉగ్ర దాడి ఘటనలను ఇతివృత్తంగా తీసుకొని సినిమాలు తీసేందుకు పోటీ పడుతున్నారని సమాచారం. పుల్వామా, సర్జికల్ స్ట్రైక్ 2, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ పేర్లను రిజిస్టరు చేసుకునేందుకు కూడా నిర్మాతలు పోటీ పడుతున్న్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు. నిజానికి దానికి గత ఏడాది ఆఖరిలో విడుదలయిన ఉరి సినిమా కూడా ఒక కారణమే, గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ ను ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అందుకే ఇలాంటి సినిమా కోసం ఇప్పుడు నిర్మాతల మధ్య పోటీ నెలకొంది.  

More Related Stories