English   

ఉగ్రవాదిగా మారిన టాలీవుడ్ రైటర్ !

Operation-Gold-Fish
2019-03-01 07:15:21

వినాయకుడు, కేరింత వంటి హార్ట్ టచింగ్ సినిమాలతో దర్శకుడిగా సాయికిరణ్ అడివి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజా సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ రూపొందుతోంది. సాయికుమార్ కుమారుడు హీరో ఆది  లీడ్ రోల్ లో నటిస్తోన్న ఈ సినిమాలో ఎయిర్టెల్ ఫోర్జీ భామ సాషా ఛత్రీ, నిత్యా న‌రేశ్ లు ఇద్దరు కథానాయికలుగా కనిపించనున్నారు. ఇక కార్తీక్ రాజు, నూకరాజు(పార్వతీశం), కృష్ణుడు రచయిత అబ్బూరి రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. సినీ రచయితగా మంచి పేరున్న అబ్బూరి రవి,  తీవ్రవాది ఘాజీ బాబా పాత్రలో నటించాడు. తాజాగా ఆయన పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను త్రివిక్రమ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అబ్బూరి రవి లుక్ ఆకట్టుకునేలా సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా వుంది. శ్రీచరణ్ పాకల సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సినిమాలో ప‌నిచేసే యూనిట్ స‌భ్యులంద‌రూ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. అయితే వీలయినంత త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు. అయితే ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నారని సమాచారం.  

More Related Stories