English   

ఈసారి కొడుకుని లైన్ లో పెట్టిన డైరెక్టర్ !

Mahi-V-Raghava
2019-03-01 10:10:51

కెరీర్‌లో చేసింది మూడు సినిమాలే అయిన‌ప్ప‌టికి అన్ని చిత్రాలు మంచి అంశాల‌తోనే. మూడవ సినిమాకే దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత నేప‌థ్యంలో సినిమా చేసే అవ‌కాశం త‌క్కువ స‌మ‌యంలోనే అందుకున్నాడు మ‌హి వి రాఘవ. యాత్ర అనే టైటిల్‌తో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాదయాత్ర ఘట్టాన్ని తెర‌కెక్కించ‌గా మ‌మ్ముట్టి ప్ర‌ధాన పాత్ర పోషించిన ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్క‌ర్ సల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ తెలుగు సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట మ‌హి వి రాఘ‌వ‌. ఇటీవ‌ల దుల్క‌ర్‌కి స్టోరీ లైన్ వినిపించ‌గా, దానికి ఇంప్రెస్ అయిన మ‌ల‌యాళ హీరో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. ఓకే బంగారం అనే డ‌బ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి దగ్గరయిన దుల్క‌ర్ ఆ తరువాత మ‌హాన‌టి చిత్రంలో శివాజీ గ‌ణేష‌న్ పాత్ర‌లో క‌నిపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి మరింత ద‌గ్గ‌ర‌య్యాడు.  చూడాలి మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమవుతాయో ?

More Related Stories