English   

నందమూరి ఫ్యాన్స్ ని భయపెడుతున్న కళ్యాణ్ రామ్ !

Kalyan-Ram
2019-03-01 11:13:00

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 118 ఈరోజు విడుదలయిన సంగత తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతానికి మిక్సేడ్ టాక్ అందుకుంటోంది.  అలా ఈ సినిమా రిలీజ్ అయ్యిందో లేదో కళ్యాణ్ రామ్ వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టాడని సమాచారం. గతంలో నందమూరి బాలకృష్ణ తో డిక్టేటర్ సినిమా తీసి తన తాజాగా చిత్రంగా బెల్లంకొండ శ్రీనివాస్ తో సాక్ష్యం మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీ వాస్ కు కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాకు రైటర్ లక్ష్మీ భూపాల కథను సిద్దం చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ ను ఫైనలైజ్ చేసి అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు. అయితే దాదాపు పన్నెండేళ్ళ క్రితం విడుద‌లైన ల‌క్ష్యం చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచయమయిన శ్రీ‌వాస్‌ కి వచ్చింది రెండే హిట్లు. ఆయన ఫామ్ లో లేకపోవడం కూడా నందమూరి అభిమానులకి ఆందోళన కలిగించే అంశమే.  అసలే హిట్ కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ ఈ పరిస్థితుల్లో శ్రీవాస్ తో చేయడం అనేది రిస్క్ అని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికే హిట్స్ కోసం ఎదురు చూస్తున్న క‌ళ్యాణ్ రామ్‌, శ్రీ‌వాస్ లు కలిసి సినిమా తీసి హిట్ కొడతారు ఏమో చూడాలి మరి.  

More Related Stories