English   

టెన్షన్ పడుతున్న మహర్షి డైరెక్టర్ !

Vamshi-Paidipally
2019-03-01 18:35:26

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయి దగ్గర దగ్గర ఏడాది కావొస్తోంది. ఆయన ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 5 న విడుదల చేసేందుకు ముందు ప్లాన్ చేయడం ఆ తర్వాత సమయం చాలదని ఇరవై రోజుల పటు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే తీసుకున్న ఆ సమయం కూడా చాలాకపోవడంతో మళ్ళీ పోస్ట్ పోన్ చేయాలని దర్శకనిర్మాతలు భావించారట, కానీ మహేష్ మాత్రం ఇలా రిలీజ్ డేట్ లు మారుస్తూ రిలీజ్ అయిన సినిమాలు ఆడలేదనే సెంటిమెంట్ ని చూపుతూ ఏప్రిల్ లోనే అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని పట్టుబట్టడంతో అదే రోజున సినిమా రిలీజ్ చేస్తున్నామని ఒక ప్రకటన కూడా చేసింది సినిమా యూనిట్. అసలు సినిమా రిలీజ్ వాయిదా వేయాలనుకున్నది షూటింగ్ జాప్యం వలెనే.  కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయాలంటే ఇప్పుడు రేత్రింబవళ్ళు షూట్ చేయాల్సి వస్తోందట. అందుకే వంశీ పైడిపల్లి బాగా టెన్షన్ పడుతున్నాడని అంటున్నారు. నిజానికి వంశీ చాలా పర్ఫెక్షనిస్ట్ అందుకే సినిమా ఇంత లేట్ అయిందని అంటున్నారు. అయితే సమ్మర్లో ఇతర స్టార్ హీరోల సినిమాలు ఏమీ లేవు కాబట్టి కొంచెం హిట్ టాక్ వచ్చినా మహేష్ సినిమా గట్టిగా ఆడుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి ఈ టెన్షన్ తో వంశీ హిట్ కొడతాడో లేక ఫట్ మనిపిస్తాడో చూడాలి.
 

More Related Stories