English   

మహేష్ తో సందీప్ సినిమా డౌటేనా ?

Is mahesh babu to work with  sandeep reddy vanga
2019-03-01 22:53:35

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి ఒకటవ సినిమాకే సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ కొట్టిన సందీప్ తర్వాత వేరే సినిమా ఏదీ ఒప్పుకోకుండా అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరిట రీమేక్ చేస్తున్నాడు. ఆ రీమేక్ దాదాపు పూర్హ్తి కావస్తున్న తరణంలో ఆయన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా ఓ మూవీని తీయ‌నున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమన్నాయి. ఇప్ప‌టికే మ‌హేష్‌ని క‌లిసి సందీప్ స్టోరీ వినిపించాడ‌ని తెలుస్తుండ‌గా, దీనికి ఫుల్ ఇంప్రెస్ అయిన మ‌హేష్ వ‌చ్చే ఏడాది ఈ చిత్రాన్ని చేద్దామ‌ని చెప్పాడ‌ని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అందుతున్న సమాచారం మేరకు అయితే, ఇప్పట్లో ఆ సినిమా వుండకపోవచ్చనేది తాజా సమాచారం. ఎందుకంటే ప్రచారం జరిగినట్టు అప్పట్లో స్క్రిప్ట్ వినిపించాలేదని తాజాగా ఆయన మహేశ్ బాబు కోసం తాను సిద్ధం చేసిన కథను వినిపించాడని సమాచారం. అయితే మీరు చెప్పిన హీరో క్యారెక్టరైజేషన్ కీ తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ కాదని వేరే లైన్ తో రమ్మనీ చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 'కబీర్ సింగ్' హిందీ సినిమా తరువాత సందీప్ మహేష్ కే మరో స్క్రిప్ట్ చెబుతాడా ? లేక ఇదే స్క్రిప్ట్ తో మరో హీరోతో సెట్స్ మీదకు వెళతాడా అనేది వేచి చూడాలి.

More Related Stories