English   

మణిరత్నం హిస్టారికల్ మూవీ...లైన్ లోకి మోహన్ బాబు !

Mohan Babu to act in Mani Ratnam's film
2019-03-01 16:44:24

విభిన్న కధాంశాలు ఏరికోరి మరీ చిత్రాలు రూపొందించే లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఒక భారీ బడ్జెట్ మూవీకి ప్లాన్ చేసినట్టు సమాచారం అందుతోంది. మణిరత్నం సినిమా అంటే ఆ కథలో ఏదో తెలియని మాజిక్ ఉంటుంది అది ఒక్కోసారి ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది ఒక్కోసారి కాదు. ఆయన నుంచి మల్టీ స్టారర్ గా వచ్చిన తాజా చిత్రం నవాబ్ తమిళంలో ఘన విజయాన్ని సాధించింది తెలుగులో కూడా మంచి కలెక్షన్లే సాధించింది. ఇప్పుడు ఆయన కల్కి రాడిన తమిళ నవల పొన్నియన్ సెల్వన్ ను సినిమాగా రూపొందించనున్నాడట.  క్రీ.శ 947లోని మొదటి రాజ రాజ చోళుని జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారట. హిస్టారికల్ డ్రామాగా తెరకేక్కే ఈ సినిమాలో నటించేందుకు విలక్షణ నటుడు, సీనియర్ హీరో మోహన్ బాబును మణిరత్నం సంప్రదించినట్టు దానికి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆయనే కాక పలు భాషలకు చెందిన స్టార్ నటులతో రూపొందే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందట. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ నవలతో వెబ్ సిరీస్ రూపొందించనున్నట్టు రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య అనౌన్స్ చేశారు. ఇప్పుడు మణిరత్నం సినిమానే తెరకెక్కించనున్నారన్నమాట. 

More Related Stories