English   

టాలీవుడ్ దర్శకుడు డైరెక్షన్ లో షారూఖ్ !

Shah-Rukh-Khan
2019-03-02 04:04:43

ఆయనో బాలీవుడ్ స్టార్ హీరో, ఒకప్పుడు అనేస్క హిట్ సినిమాలతో, ఏడాదికి కనీసం ఒక హిట్ అయినా కొడుతూ హ్యాపీగా ఉండేవాడు, కానీ గత కొన్నాల్లగా ఆయనకు సక్సెస్ దూరంగానే ఉంటోంది. మరొకరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు ముందు హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెడితే అది వర్కౌట్ కాక దర్శకుడిగా మారి ఒకటి రెండు సినిమాలు చేశాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారని బీటవున్ టాక్. ఇంతకీ ఆ హీరో, డైరెక్టర్ లు ఎవరు అనుకుంటున్నరా, వారే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌, లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి. నిజానికి కొన్నాళ్ళగా షారూఖ్ కి ఒక్క హిట్ కూడా లేదు. చివ‌రిగా జీరో అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా ప‌డింది. దీంతో ఆయన ఇప్పుడు మెంటల్ హై క్యా అనే సినిమాలో ఒక లీడ్ రోల్ పోషిస్తున్నాడ‌ట‌. ఈ చిత్రంలో కంగ‌నా రనౌత్‌, రాజ్ కుమార్ రావులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు ప్ర‌కాశ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. షారూఖ్ పాత్ర చిత్రానికి కీ రోల్‌ అని అంటున్నారు. బొమ్మ‌లాట‌, అన‌గ‌న‌గ ఓ ధీరుడు, సైజ్ జీరో లాంటి సినిమాల్ని డైరెక్ట్ చేసి పెద్దగ సక్సెస్ అవ్వని ప్రకాష్ తొలిసారిగా బాలీవుడ్‌లో మెంట‌ల్ హై క్యా అనే మూవీని చేస్తున్నాడు. చూడాలి వీరిద్దరికీ ఈ సినిమా అయిన హిట్ తెచ్చి పెడుతుందేమో ?

More Related Stories