English   

ఆయ‌న‌కు మాత్ర‌మే ముద్దు ఇస్తానంటున్న త‌మ‌న్నా..

Tamannah
2019-03-02 05:37:03

ఆయనకు తప్ప మరొకరికి ముద్దు ఇవ్వనంటుంది తమన్నా. కెరీర్ మొదలుపెట్టి దాదాపు 14 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు తమన్నా ఎవరికి లిప్ లాక్ సీన్స్ చేయ‌లేదు. అందాలు ఎంత ఆరబోసినా.. గ్లామర్ ఎంత ఒలకబోసినా ముద్దు సన్నివేశాల విషయంలో మాత్రం తమన్నా అస్సలు దారి తప్పలేదు. ఎప్పుడూ హ‌ద్దులు కూడా దాట‌లేదు. తన కెరీర్ లో లిప్ లాక్ సీన్స్ అనేవి లేకుండా చూసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కావాలంటే అందాలు ఎక్కువగా ఆరబోస్తాను కానీ ముద్దుల్లో మాత్రం ముద్దులు ఉంటాయ‌ని చెబుతుంది ఈ మిల్కీ బ్యూటీ. తన పెదవులను పంచుకునే అవకాశం ఏ హీరోకు కూడా ఇవ్వలేదు ఈమె. అయితే ఒక్క హీరోకు మాత్రం ముద్దు సన్నివేశాలు చేస్తానని చెబుతోంది తమన్నా.  అతడే హృతిక్ రోషన్.. ఈమె కెరీర్ మొదటి నుంచి కూడా హృతిక్ రోషన్ కు అతి పెద్ద అభిమాని. ఒకవేళ ముద్దు సన్నివేశాలు చేయాల్సి వస్తే ఏ హీరో కూడా చేయను కానీ హృతిక్ రోష‌న్ తో మాత్రం అలాంటి సన్నివేశాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతుంది త‌మ‌న్నా. ఆయనతో నటించే అవకాశం వస్తే అసలు అని చెబుతోంది తమన్నా. ఎందుకంటే ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ అని అలాంటి హీరోతో నటించే అవకాశం వస్తే ఎలా వ‌దులుకుంటాను అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే తన ముద్దు నిబంధన కూడా పక్కనపెట్టి ఆయనతో సినిమా చేస్తే లిప్ లాక్ సీన్స్ కూడా ఇస్తాన‌ని బోనస్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మ‌రి ఈ ఆన్స‌ర్ నచ్చి ఎవరైనా హృతిక్ రోష‌న్, తమన్నా కాంబినేషన్ కలుపుతారేమో చూడాలి.

More Related Stories