English   

చంద్రబాబు మీద మోహన్ బాబు ఫైర్...అందుకేనా ?

Mohan-Babu
2019-03-02 13:58:07

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద నటుడు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు నాకు ఎంతో సన్నిహితుడని చెబుతూనే ఆయన మీద విరుచుకు పడ్డారు. తాను నడుపుతున్న విద్యానికేతన్ కళాశాల గొప్పదని చంద్రబాబే  స్వయంగా చెప్పారన్న మోహన్ బాబు 2014-15 సంవత్సరం నుంచి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వలేదని దాని వలన ఎందఱో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. అప్పుడప్పుడు మా కాలేజీకి భిక్షమేస్తూ వచ్చారని ఏపీ సీఎం మీద విరుచుకుపడ్డ మోహన్ బాబు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయాడని విద్యాభివృద్థికి ఏపీ సర్కార్ ఏ మాత్రం పనిచేయడం లేదని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేపధ్యంలో తన మీద పార్టీ ముద్ర వేసే అవకాశముందని, తాను ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేశారు.  ఏ రాజకీయ పార్టీ ప్రోత్సాహంతో మాట్లాడడం లేదంటూనే ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే మోహన్ బాబు కుమారుడు విష్ణు చేసుకున్న అమ్మాయి స్వయానా జగన్ కి సోదరి కావడం, అందుకే ఆయన కానీ ఆయన కుమార్తె మంచు లక్ష్మి కానీ వైసీపీ తరపున పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అదీ కాక నిన్న కాక మొన్న విష్ణు దంపతులు జగన్ తో భేటీ ఐన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో మోహన్ బాబు మునుదుకు వచ్చి ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

More Related Stories