English   

ఆయ‌న వ‌ల్లే ప‌వ‌ర్ స్టార్ అయ్యానంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. 

Pawan-Kalyan
2019-03-02 09:10:46

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తన జనసేన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని జనాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ కాదు పూర్తిగా జనసేనాని. ప్రజల కోసం ప్రజల మధ్య ఆయన తిరుగుతున్నాడు. ప్రస్తుతం రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తున్న పవన్ కళ్యాణ్ రైల్వేకోడూరులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక వ్యక్తిని తన దగ్గరికి ప్రజలకు గర్వంగా ఆయన గురించి పరిచయం చేశాడు పవన్ కళ్యాణ్. ఇంతకీ ఎవరు ఆయన అంటూ అంత ఆశ్చర్య పోతున్న సమయంలో మరిన్ని షాకింగ్ విషయాలు చెప్పారు పవన్ కళ్యాణ్. ఈరోజు పవర్ స్టార్ అని అంటున్నారు అంటే దానికి కారణం రైల్వేకోడూరు వ్యక్తి దాశరథిగారు అంటూ ఆయనను పరిచయం చేశాడు. 

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత తనను నమ్మి సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని.. అలాంటి సమయంలో దాశరధి గారు తన రెమ్యూనరేషన్ ఇచ్చిన నిర్మాత అంటూ ఆయనను గుర్తు చేసుకున్నాడు. రైల్వేకోడూరులో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన అక్కడే ఉండి చూస్తున్నట్లు జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ కు చెప్పారు. దాంతో దాశరథిని తన దగ్గరికి పిలుచుకుని ఆయనతో ఆప్యాయంగా మాట్లాడి తనకు తొలి పారితోషికం ఇచ్చిన నిర్మాత రైల్వేకోడూరు నుంచి వచ్చాడు అంటూ ఆయనను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దాంతో దాశరథి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రైల్వేకోడూరు నుంచి నా జీవితం మారిపోయింది.. రైల్వేకోడూరు ఒక గెలిచే సీట్ కావాలని కోరుకున్నాడు ప‌వ‌న్. మొత్తానికి పవన్ కళ్యాణ్ పట్టుదల చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో ఏదో చేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయనను లైట్ తీసుకున్న కూడా తర్వాత కచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం వచ్చేలా కనిపిస్తోంది.

More Related Stories