English   

సుమన్ బ్లూ ఫిలిం కేస్ వెనక చిరంజీవి....క్లారిటీ ఇచ్చేశారు !

Suman
2019-03-02 10:26:58

టాలీవుడ్ లో 80-90 దశాకాల మధ్య కాలంలో స్టార్ హీరో రేసులో చిరుతో పోటీపడిన సుమన్ ఆ తర్వాత ఒక రకంగా కాల గర్భంలో కలిసిపోయాడనే చెప్పాలి. ఆయనకు బ్లూ ఫిల్మ్ కేసు రూపంలో తగిలిన దెబ్బ మాములుది కాదు. ఏడాదికి పైగా జైలు జీవితం గడిపిన ఆయన ఆపై సినిమాలు లేక, ఒకానోక స్థాయిలో ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యాడు. అయితే ఆ కేసులో ఎవరి హస్తం ఉందోనన్న విషయాన్ని ఎప్పుడూ ఎక్కడా నేరుగా చెప్పకుండా కొందరు తన కెరీర్ ను తొక్కేద్దామని ప్రయత్నించారంటూ చాలా సార్లు చెప్పుకోచ్చాడు. అయితే అప్పటికే ఆయనకు చిరంజీవితో ఒక విషయంలో ఏదో మనస్పర్ధలు ఉండడంతో ఈ విషయం వెనుక చిరంజీవి ప్రమేయం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. దీని మీద సుమన్ ఇప్పటి దాకా ఎప్పుడూ స్పందించలేదు, అయితే ఆయన తాజాగా ఒక చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. సుమన్ జైలుకు వెళ్లిన విషయంలో ఇప్పటికీ ఉన్న అనుమానాన్నే ప్రశ్నగా ఆయన ముందుంచాడు ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్. దీని మీద క్లారిటీ ఇచ్చాడు సుమన్  ఈ కేసులో చిరంజీవి, వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనే వార్తల్లో నిజం లేదని ఇది చిరంజీవి అంటే గిట్టని వారు చేసిన తప్పుడు ప్రచారమని అన్నారు. ఆయనంటే పడనివారు ఎవరో  పుకార్లు పుట్టించారని అన్నారు.  చిరంజీవితో అప్పట్లో నాకు ఒక ఇష్యూ ఉందని కానీ ఈ కేసుతో ఆయనకు ఎలాంటి లింక్ లేదని ఆయన చెప్పుకొచ్చారు. రోజుల్లో ఇంటర్నెట్, టీవీ ఛానల్స్ లేవు కేవలం మేగజైన్లు, పేపర్లు మాత్రమే ఉండేవని ఇప్పటి చానెళ్ళు టీఆర్పీ కోసం, యూ ట్యూబ్ చానెళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నట్టే ఆప్పట్లో వారు కూడా తమ సర్క్యులేషన్ పెంచకోవడానికి ఇలాంటి వార్తలు రాసేవారని సుమన్ చెప్పుకొచ్చారు.
 

More Related Stories