English   

బాల‌య్య బ‌య్య‌ర్ల బాధ్య‌త తీసుకుంటున్నాడా లేదా..?

Balayya
2019-03-02 10:57:54

ఒకటో రెండో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఏకంగా 50 కోట్లు నష్టపోయిన మహానాయకుడు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారని అంత ఆసక్తికరంగా చూస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తీసుకొని దాదాపు 60 కోట్లకు పైగా నష్టపోయారు డిస్ట్రిబ్యూటర్లు. రెండు భాగాలు కలిపితే వచ్చిన నష్టాలు ఇవే. కథానాయకుడు తీసుకొని నష్టపోయిన బయ్యర్లకు మహానాయకుడు ఉచితంగా ఇస్తానని అప్పట్లో ప్రకటించాడు బాలకృష్ణ. కానీ విడుదలకు ముందు మళ్ళీ ఇందులో కూడా కొద్దిగా తిరకాసు పెట్టి డిస్ట్రిబ్యూటర్ల నుంచి డబ్బులు తీసుకున్నారని ప్రచారం ఉంది. ఇక్కడే అసలు సమస్యలు మొదలయ్యాయి. ఎందుకంటే మహానాయకుడు సినిమా కేవలం 5 కోట్లు కూడా వసూలు చేయలేక చేతులెత్తేసింది. దాంతో ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్లకు ఎవరు సమాధానం చెబుతారు అర్థం కావడం లేదు. ముఖ్యంగా బాలకృష్ణ కూడా మహానాయకుడు డిస్ట్రిబ్యూటర్ల విషయంలో ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయాడు. దాంతో తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక డిస్ట్రిబ్యూటర్లు కూడా సతమతమవుతున్నారు. కచ్చితంగా ఆదుకోవాలి లేదంటే రోడ్డున పడ‌తాం అంటూ దీనంగా బాలయ్య వైపు చూస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కావడంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు బాలకృష్ణ. అందులోనూ తీసుకొని దారుణంగా మోసపోయిన ఆదుకోవాల్సిన బాధ్యత త‌న‌దే అని ఆలోచిస్తున్నాడు నందమూరి నటసింహం. దానికి నష్టపరిహారం ఇప్పుడు చెల్లిస్తాడా లేదంటే బోయపాటి సినిమాతో సెట్ చేస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కచ్చితంగా నష్టపోయిన బాధ్యత మాత్రం బాలకృష్ణ తీసుకుంటున్నాడు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారం. దాన్ని ఆయన ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే తను తీసుకొని వాళ్లంతా నష్టపోయారు కాబట్టి వాళ్లను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా తనదే అనుకుంటున్నాడు బాలకృష్ణ.

More Related Stories