English   

బోయ‌పాటి శ్రీనుకు మ‌రో ఆప్ష‌న్ కూడా లేదుగా ఇప్పుడు.. 

Balayya
2019-03-02 18:47:02

బోయపాటి శ్రీనుకు టైం అసలు కలిసి రావడం లేదు. ఆయన బాలకృష్ణ దగ్గర అడ్డంగా బుక్ అయిపోయాయి ఇప్పుడు. రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా ఆలోచిస్తున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం బోయపాటి శ్రీనును బాగానే న‌మ్మేసాడు. ఆయనకు గతంలో బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కావడంతో ఇప్పుడు మరో మాట లేకుండా ఆయనతో సినిమా చేయడానికి సై అంటున్నాడు నందమూరి నటసింహం. బాలకృష్ణతో సినిమా చేయాలంటే బోయపాటి మరో నాలుగు నెలలు ఆగాలి. మరో ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ ఎన్నికలతో బిజీగా ఉన్నాడు కాబట్టి. రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. 

దానికి తోడు ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు జగన్.. మరోవైపు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు నాయుడుని ఎప్పుడెప్పుడు సీఎం కుర్చీ నుంచి దించేద్దామా అని వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తన ఇమేజ్ కూడా పార్టీకి కచ్చితంగా అవసరం అని భావిస్తున్నారు బాలకృష్ణ. అందుకే రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు ఈయ‌న‌. ఇలాంటి సమయంలో సినిమాలు చేస్తూ పోతే పార్టీకి నష్టం జరుగుతుందని బోయపాటి సినిమాను పక్కన పెట్టేశారు బాలకృష్ణ. ఏదేమైనా ఎన్నికల తర్వాత చూసుకుందాం అంటున్నాడు. దాంతో బోయపాటి శ్రీనుకు కూడా మరో ఆప్షన్ కనిపించడం లేదు ఇప్పుడు. అందుకే బాలకృష్ణ వచ్చే వరకు వేచి చూడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. జూన్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ సినిమాను కూడా బాలకృష్ణే నిర్మిస్తున్నాడు.

More Related Stories