English   

నలుగురు ముద్దుగుమ్మలు ఒకే చోట...అందుకే !

Samantha Akkineni, Kajal Aggarwal, Rakul Preet and Tamannaah come together
2019-03-02 19:55:35

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు తమిళ, మళయాళ బాషలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న కాజ‌ల్, ర‌కుల్, స‌మంత‌, త‌మ‌న్నాలు ఒకే వేదిక మీద మెరిసి అభిమానులకు  కనువిందు చేశారు. అయితే వీరు కలిసింది ఎందుకా ? అనుకుంటున్నారా ? వీరు నలుగుగ్రూ కలిసింది ఒక హాలీవుడ్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం జ‌రిగింది. కెప్టెన్ మార్వెల్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చ్ 8న విడుద‌ల కానుంది. మార్వెల్ సంస్థ నిర్మాణంలో కామిక్స్‌ పాత్ర కెరోల్‌ డేన్వర్స్‌ ఆధారంగా రూపొందిన అమెరికన్‌ సూపర్‌ హీరో సినిమానే ఈ కెప్టెన్‌ మార్వెల్‌. బ్రీ లార్సెన్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హర్‌ ఇన్‌ ఎవ్రీ హీరో పేరుతో చెన్నైలో నిన్న ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. అందులోనే ఈ న‌లుగురు నాయికలు క‌లిసి సందడి చేశారన్నమాట. అక్కడ ప్రేక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. ఇండియన్‌ వెర్షన్‌ ‘ఐరన్‌ మేన్‌’కి హీరోగా ఎవరైతే బావుంటారని అడగ్గా రకుల్, సమంతలు వెంటనే ‘సూర్య’ అన్నారు. కాజల్‌ ఇళయదళపతి, విజయ్‌ పేరు చెప్పగా తాళా అజిత్‌ పేరు చెప్పింది తమన్నా.

More Related Stories