English   

ఇట్స్ అఫీషియల్ శౌర్యతో అవసరాల మూవీ !

Avasarala Srinivas to direct Naga Shaurya & Malavika Nair
2019-03-02 13:32:34

ఒకవైపు నటుడిగా రాణిస్తూనే మంచి పాత్రలు చేస్తు మరొవైపు దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నాడు అవసరాల శ్రీనివాస్. ఊహలు గుసగుసలాడే సినిమాతో నాగశౌర్య హీరోగా దర్శకుడిగా మారి మంచి హిట్ ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ నటన మీదే ద్రుష్టి పెట్టి కొంతకాలం తరువాత నాగశౌర్య, నారా రోహిత్ లను హీరోలుగా పెట్టి 'జో అచ్యుతానంద' సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమాకి అనుకున్నంత క్రేజ్ దక్కలేదు. ఇక రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ నాగశౌర్య ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని అవసరాల భావిస్తున్నాడని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. . ఫారిన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నాగశౌర్య హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించేందుకు అవసరాల శ్రీనివాస్‌ రెడీ అవుతున్నాడట. ఈ విషయాన్ని ఈరోజు సినిమా నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు.  పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిబొట్లలు దాసరి ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నారని ప్రకటించారు. మార్చ్ రెండవ వారం నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని నాగ శౌర్య సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. నిజానికి ముందుగా ఈ కథలో హీరోగా నాని ని అనుకున్నారు కానీ నాచురల్ స్టార్ బిజీగా ఉండటంతో మళ్ళీ నాగశౌర్యతోనే సినిమా ఫైమల్ అయ్యిందట. మరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.

More Related Stories