English   

శివరాత్రికి ముద్ర వేయనున్న అర్జున్ సురవరం !

Arjun Suravaram movie teaser releasing on March 4th
2019-03-02 21:49:41

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న సినిమా ‘అర్జున్ సురవరం’. తొలుత ముద్ర అనే టైటిల్ తో ఈ సినిమా విడుదలకి రెడీ అయినా అదే పేరుతో వేరే సినిమా రిలీజ్ కావడంతో కాస్త వివాదం కూడా అయ్యింది. దాంతో ఆ టైటిల్ మర్చి అర్జున్ సురవరంగా నామకరణం చేశారు. నిఖిల్ జర్నలిస్ట్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా వేలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర కొత్త పోస్టర్ విడుద‌ల చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. స్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణముర‌ళి, నాగినీడు, ప్రగ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్రల్లో న‌టిస్తున్నారు. 

More Related Stories