English   

పవన్ విషయం అకీరాకు చెప్పా...సినిమా కోసమే ఇదంతా ?

Renu-Desai
2019-03-03 05:35:32

సినీ నటి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మామూలుగా అయితే ఒక వార్త వచ్చి ఊరుకునేది ఏమో కానీ అదే సమయంలో పవన్ కూడా కర్నూలు జిల్లా పర్యటనలో ఉండటంతో, రేణు దేశాయ్ పవన్ ని తీవ్రంగా విమర్శిస్తున్న సాక్షి చానల్ మైక్స్ తో అ ఛానల్ కోసం ఇంటర్వ్యూలు తీసుకోవడంతో ఈ విషయం బాగా హైలైట్ అయ్యింది. పవన్ కు వ్యతిరేకంగా రేణు దేశాయ్ ను కావాలనే వైసీపీ రంగంలోకి దించిందనే కథనాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలన్నింటికీ రేణు సమాధానమిచ్చారు. తన పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని రైతుల గురించి ఒక సినిమా తీస్తున్నానని దానికి సన్నాహకంగా మట్టి మనుషులు అనే ఒక రైతు సమస్యలు ముఖ్య ఉద్దేశంగా ఒక కార్యక్రమం చేస్తున్నానని చెప్పింది. రైతుల కోసం తాను చేస్తున్న పనిని రాజకీయాలతో ముడిపెట్టవద్దని విన్నవించారు. ఇప్పటి వరకు తాను 200 మంది రైతులను కలిశానని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహకారం అందించేలా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని తన వల్ల ఒక్క రైతు జీవితం బాగుపడినా తాను చాలా సంతోషిస్తానన్నారు. ఒకే సమయంలో ఒకే విషయమై పర్యటించినంత మాత్రాన రాజకీయం ఎలా అవుతుందని రేణు దేశాయ్ ప్రశ్నించింది. ఈ విషయం గురించి అనవసరమైన కామెంట్స్ చేసేవారంతా పనీపాటా లేని మూర్ఖులు, బుద్ది లేని మనుషులు అయి ఉంటారంటూ రేణు స్పందించారు.  కళ్యాణ్ గారు కూడా అదే టౌన్ లో ఉన్నారని తెలియగానే అకీరాకు మెసేజ్ పెట్టానని నేను మీ నాన్న ఒకే టౌన్ లో ఉన్నామని చెప్పగానే అకీరా కూడా చాలా సంతోషించాడని రేణు పేర్కొంది.  

More Related Stories