English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌య‌న‌తార రొమాన్స్.. అదుర్స్ క‌దా..

Vijay Devarakonda To Romance Nayanthara
2019-03-03 09:52:38

విజయ్ దేవరకొండ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళనాట కూడా సంచలనాలు సృష్టిస్తున్నాడు. అక్కడ ఆయన సినిమాలు ఓ రేంజ్ లో ఆడేస్తున్నాయి. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు తెలుగు వర్ష‌న్ లోనే తమిళనాట రచ్చరచ్చ చేశాయి. ఈ రెండు సినిమాలతో ఆయనకు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈ నమ్మకంతోనే గతేడాది నోటా సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఊహించని ఫలితం తీసుకురాలేదు. దాంతో మళ్లీ తమిళ ఇండస్ట్రీ వైపు విజయ్ దేవరకొండ అడుగులు వేయడం కష్టమే అనుకున్నారు. కానీ ఈయన ఎప్పుడు సాహసం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఈ హీరో. తాజాగా మరో తమిళ సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా.. ఏకంగా లేడీ సూప‌ర్ స్టార్ నయనతారతోనే నటించడానికి సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ. ప్రముఖ తమిళ నిర్మాత ఎస్ఆర్ ప్రభు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ, నయనతార కాంబినేషన్లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. అక్కడ నయనతార.. ఇక్కడ విజయ్ దేవరకొండ తమ తమ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఎవరి కమిట్మెంట్స్ వాళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరు నటించబోయే సినిమాపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు 2019లో విడుదల కానున్నాయి. ఆ త‌ర్వాతే న‌య‌న‌తార సినిమాపై క్లారిటీ వ‌స్తుంది. ఒక‌వేళ ఈ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ అయితే.. విజ‌య్, న‌య‌న్ నిజంగా అద్భుతాలు చేయ‌డం ఖాయం.

 

More Related Stories