English   

అయ్యో పాపం హ‌న్సిక‌.. ఎంత క‌ష్ట‌మొచ్చిందో పాపం..

Sundeep Kishan And Hansika Tenali Ramakrishna BA BL
2019-03-03 17:29:58

ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసిన హన్సికకు ఇప్పుడు ఒక్క అవకాశం కూడా రావట్లేదు. అప్పుడెప్పుడో పూర్వకాలంలో మంచు విష్ణుతో నటించిన లక్కున్నోడు సినిమా ఈమెకు తెలుగులో చివరిది. ఆ సినిమా కూడా లక్కు తీసుకురాలేకపోయింది. దాంతో పూర్తిగా తెలుగు ఇండస్ట్రీ కి దూరమైపోయింది హన్సిక. ప్రస్తుతం తమిళనాట వరస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే చాలా రోజుల తరువాత తెలుగులో మరో సినిమా చేస్తుంది ఈ భామ‌. హీరో సందీప్ కిషన్ తో జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న తెనాలి రామకృష్ణలో ఈమె నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో హన్సిక అనే ఓ హీరోయిన్ ఉంది అని గుర్తించుకోవాలి అంటే కచ్చితంగా తెనాలి రామకృష్ణ సినిమా ఏదో ఒక మాయ చేయాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. దాంతో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఆశలన్నీ సందీప్ కిషన్ సినిమాపైనే ఉన్నాయి.
అయితే ప్రస్తుతం సందీప్ కిషన్ కూడా అస్తిత్వం కోసం పోరాడుతున్నాడు. ఇక్కడ ఉనికి చాటాలంటే కచ్చితంగా హిట్ కొట్టి చూపించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హీరోను హన్సిక నమ్ముకోవడం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. దానికి తోడు దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కూడా వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి మొత్తం డిజాస్టర్ కాంబినేషన్లో ఇప్పుడు తెనాలి రామకృష్ణ సినిమా వస్తుంది. అయితే కామెడీ హ్యాండిల్ చేయడంలో నాగేశ్వర్ రెడ్డి దిట్ట. ఆయనను తక్కువగా అంచనా వేయడానికి లేదు. దాంతో ఈ దర్శకుడు ఖచ్చితంగా ఏదో ఒక మాయ చేస్తాడని నమ్ముతుంది హన్సిక. పైగా ఆమెకు గతంలో దేనికైనా రెడీ అనే హిట్ సినిమా ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇప్పుడు కూడా అదే చేస్తాడు అనుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తెనాలి రామకృష్ణ హన్సిక కెరీర్ కు తెలుగులో ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

More Related Stories