English   

పాయల్ కు ఈ సినిమా అయినా ఓకే అయ్యేనా ?

Payal Rajput to romance Bellamkonda Sreenivas
2019-03-03 11:37:50

తెలుగులో చేసిన తొలి సినిమాతోనే కుర్రకారుని ముందు ద్వేషించేలా చేసుకుని ఆ తర్వాత వారి గుండెల్లోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది పంజాబీ టెలివిజన్ నటి పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా ద్వారా నటిగా, గ్లామర్ పరంగా మంచి పేరైతే వచ్చింది గానీ ఊహించిన విధంగా అయితే ఆఫర్లు రాలేదు, అయితే ఆ మధ్య నాగార్జున, వెంకటేష్ ల సరసన ఆఫర్లు వచ్చాయని వార్తలొచ్చాయి, అయితే వాటి గురించి అయితే ఇంకా అఫీషియల్ ప్రకటనలు లేవు. కానీ ఆమె తాజాగా బెల్లంబాబు సాయి శ్రీనివాస్ సరసన నటించే అవకాశం అందుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళ చిత్రం రాచ్చసన్ రీమేక్ లో నటిస్తున్న బెల్లంబాబు ఆ సినిమా తర్వాత స్టూవర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా చేయనున్నాడు, ఆ సినిమా కోసం నిర్మాతలు పాయల్ రాజ్ పుత్ ను సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా డైరెక్ట్ చేసిన వంశీ కృష్ణ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ని హీరో అక్క పాత్ర కోసం ఎంపిక చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు హీరోయిన్ పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ తో మరో రెండు మూడు రోజుల్లో అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నారని అంటున్నారు.

More Related Stories