English   

వ‌ర్మ కావాల‌ని గిల్లుతున్నాడా.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో జూనియ‌ర్..

Lakshmis NTR Shooting Balakrishna Jr Ntr Movie pics
2019-03-03 12:27:38

సెటైర్లు వేయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరూ చేయలేరు ఉంటాడు రాంగోపాల్ వర్మ. ఈ విషయం మొత్తం ప్ర‌పంచానికి తెలుసు. ఎందుకంటే ఈయన మాట్లాడే మాటల్లో ఎప్పుడు సెటైర్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ దర్శకుడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చాలా మందిపై విమర్శనాస్త్రాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమా పోస్టర్లు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు రాంగోపాల్ వర్మ. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ప్రజల ముందుకు వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఈ దర్శకుడు. ఇక అక్కడే ఆగి ఉన్న ఒక ఆటో వెనకాల జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతో పాటు బాలకృష్ణ మహానాయకుడు పోస్టర్లు కనిపిస్తున్నాయి.
నిజానికి ఎన్టీఆర్ సినిమాలో ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే ఇది అంతా 20 ఏళ్ల కింది కథ. అప్పుడు ఇవన్నీ లేవు అయినా కూడా కావాలని తన సినిమా షూటింగ్ లో మహానాయకుడుతో పాటు జై లవకుశ సినిమా పోస్టర్లు కనిపించేలా ఫోటోలు విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. సినిమాలో ఇది కనిపించకపోవచ్చు కానీ షూటింగ్ లో మాత్రం కనిపించేలా ప్లాన్ చేశాడు ఈ దర్శకుడు. కావాలని బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు లక్ష్మీస్ ఎన్టీఆర్ షూటింగ్ లో కనిపించేలా రామ్ గోపాల్ వర్మ ప్లాన్ చేసాడు అంటూ ఆయనపై మండి పడుతున్నారు నంద‌మూరి అభిమానులు. ఎవరేమనుకున్నా తన సినిమాకు ప్రమోషన్ వస్తుంది కదా అని హ్యాపీ గా ఫీల్ అవుతున్నాడు ఈ దర్శకుడు. మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కానుంది. మరి ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్ట‌ర్ అయిన‌ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏం చేస్తుందనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.

More Related Stories