English   

బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యాబాల‌న్ ఎందుకు న‌టించింది..? 

Vidya-Balan
2019-03-04 02:45:56

ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ ఎందుకు నటించింది.. అసలు ఈ ప్రశ్నకు సమాధానం ఇన్ని రోజులు ఎవరికీ తెలియలేదు. పారితోషికం ఏమైనా ఎక్కువగా ఇచ్చి ఒప్పించారా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో నటించడానికి కారణం రెమ్యూనరేషన్ కాదు అని సంచలన సమాధానం చెప్పింది విద్యాబాలన్. దీనికి చాలా కారణాలు ఉన్నాయని.. ముఖ్యంగా బసవతారకం క్యారెక్టర్ నచ్చి తాను చేయాలని ఫిక్స్ అయిపోయానంటుంది విద్యా బాలన్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విష‌యాలు చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఎన్టీఆర్ బయోపిక్ లో తన అనుభవాల గురించి మీడియాతో పంచుకుంది. క్రిష్, బాలకృష్ణ తన దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ బయోపిక్ కథ చెప్పినప్పుడు ఈ సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది ఈ భామ‌. అయితే బసవతారకం క్యారెక్టర్ తెలిసి అందులో ఆమె అమాయకత్వం మంచితనం ఇవన్నీ నచ్చి ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాన‌ని చెప్పింది విద్యాబాలన్. దక్షిణాది అమ్మాయి అయినా కూడా ఓ దక్షిణాది సినిమా చేయడానికి తనకు 15 ఏళ్లు పట్టిందని.. ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది విద్యాబాలన్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఇది తన మనసుకు నచ్చిన చిత్రం అంటోంది ఈ భామ‌. కథ నచ్చితే ఇప్పుడు కూడా తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటుంది విద్యాబాలన్. ఆ మధ్య చిరంజీవితో నటించడానికి ఈ భామ నో చెప్పింది. అయితే కథ నచ్చితే హీరో ఎవరైనా పర్లేదు అంటుంది విద్య. మరి ఈమెకు నచ్చే కథ ఎవరు తీసుకొస్తారో చూడాలి.
 

More Related Stories