English   

కంగనా లవ్ లో ఉందా ? ఎవరో పాపం !

Kangana-Ranaut
2019-03-04 02:49:32

మనకి ఇక్కడ వర్మ ఎలాగో బాలీవుడ్ లో కంగనా అలా అన్న మాట. కంగనా రనౌత్ అంటేనే కాంట్రవర్శీ అన్నంతగా వివాదాలకు కేరాఫ్ అయిపోయిండీ నటి. కొద్ది రోజుల నుండి మ‌ణిక‌ర్ణిక విష‌యంలో క్రిష్‌ తో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన ప‌లువురి మీద సంచలన కామెంట్స్ చేసిన కంగనా తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప్రేమ విష‌యాన్ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం తాను ప్రేమ‌లో ఉన్నాన‌ని చెబుతూనే గతంలో ఈ ప్రేమ విష‌యంలో త‌న‌కి ఎన్నో చేదు అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌ని పేర్కొంది. కెరీర్ మొదట్లోనే తన కంటే వయసులో చాలా పెద్ద వాడైన ఆదిత్య పంచోలితో ఎఫైర్ నడిపిన కంగనా ఆ తర్వాత హృతిక్ తో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఐతే బ్రేకప్ తర్వాత వీళ్లిద్దరిని బజారుకు ఈడ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా ఎవరైనా కంగనాతో సన్నిహితంగా మెలగడానికే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఐతే అలాంటి సీన్ ఉండగా ఇప్పుడు కంగనా తాను మళ్లీ ప్రేమలో పడ్డట్లు ఆమె వెల్లడించింది. ఐతే పెరిగిన తన వయసు రీత్యా ఈ డేటింగ్స్ లాంటివి నడవవని సీరియస్ రిలేషన్‌షిప్‌ కోసమే చూస్తున్న తనకు సరైన వ్యక్తి దొరికాడని కంగనా చెప్పుకొచ్చింది. ఐతే కంగనా తన ప్రేమ గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వగానే రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. చూడాలి మరి ఈ వరూధిని మనసు దోచిన ప్రవరాఖ్యుడు.

More Related Stories