English   

రవితేజ సినిమా మొదలయిపోయింది !

raviteja
2019-03-04 04:55:36

అనిల్ రావిపూడితో రాజా ది గ్రేట్ సినిమా హిట్ కొట్టాక రవితేజ హీరోగా నటించిన టచ్ చేసి  చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఇందులో శ్రీనువైట్ల డైరెక్షన్ లో చేసిన అమర్ అక్బర్ ఆంటోని అయితే దాదాపు రూ.22 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ  రూ.6.20 కోట్లనే వసూలు చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అలా మూడు వరుస ఫ్లాప్స్ తో దీలాపడ్డ రవితేజ ఎక్కడికి పోతావు చిన్నవాడా డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు. ఆ సినిమాకి డిస్కో రాజా అనే పేరు ఫైనల్ చేసినట్టు రవితేజ పుట్టినరోజున సినిమా ఫస్ట్ లుక్ వదిలారు. ఆ ఫస్ట్‌లుక్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ ఇప్పటి వరకు ఆయన కెరీర్‌ లో చేయని డిఫరెట్ రోల్ చేస్తున్నాడట. అయితే కధలో కొన్ని మార్పులు జరుగుతున్నాయని ఈ సినిమా లేట్ అయ్యే అవకాశం ఉందని ఇలా పలురకాల వార్తలు వచ్చాయి ఈ నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యమవుతోందని వార్తలు వచ్చాయి. అయితే వీటన్నిటినీ తోసిపుచ్చుతూ ఈరోజు ఈ సినిమా పూకా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఈ సినిమా రేపటి నుండి సెట్స్ మీదకు వెళ్ళనుందట, ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజపుత్ నటిస్తోంది. నెల టికెట్ సినిమాకి నిర్మాతగా ఉన్న రాం తాళ్ళూరి ఈ సినిమా కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

More Related Stories