English   

సాహో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.. జాగ్ర‌త్త ప్ర‌భాస్..

Prabhas
2019-03-04 12:58:25

ఓ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి అంటే దర్శక నిర్మాతలకు అంతకంటే ఆనందం మరోటి ఉండదు. దానివల్ల సినిమాకు కలెక్షన్లు కూడా పెరుగుతాయి. కానీ అంచనాలు పెరగడం ఎంత పాజిటివ్వో అంత నెగెటివ్ కూడా. ఎందుకంటే ఏ మాత్రం తక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకులను దారుణంగా సినిమాలను తిప్పి కొడతారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల విషయంలో ఇది ప్రూవ్ అయింది కూడా. ఇప్పుడు సాహో సినిమాపై పెరుగుతున్న అంచనాలు చూస్తుంటే అభిమానులు సంతోషంతో పాటు భయపడుతున్నారు కూడా. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ ఎవరూ చేయనటువంటి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. దాదాపు 300 కోట్లతో సాహో సినిమా తెరకెక్కుతుంది. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో కూడా సినిమాపై అంచనాలు ఆకాశానికి చేర్చేసింది.  ఇక ఇందులో ప్రభాస్ లుక్ కూడా అదిరిపోయింది. బాలీవుడ్ తారలు.. భారీ బడ్జెట్.. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుజీత్. దాంతో అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. మరి ఈ స్థాయిని అందుకోవడం కూడా ఒక్కోసారి కష్టం అవుతుంది కానీ సినిమా కచ్చితంగా అందుకుంటుందని.. ఇండియన్ సినిమాల్లో నెవర్ బిఫోర్ యాక్షన్ ఎంటర్టైనర్ చూస్తారని హామీ ఇస్తున్నాడు ఈ దర్శకుడు. ఆగస్టు 15న సాహో సినిమా విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ లుక్ కూడా అదిరిపోయింది. మొత్తానికి ప్రభాస్ అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మ‌రి సాహో ఏం చేస్తుందో చూడాలిక‌. 

More Related Stories