English   

సుమంత్ ను త‌క్కువ‌గా అంచ‌నా వేసారు.. కానీ దుమ్ము దులిపేసాడు..

Sumanth
2019-03-04 13:23:03

కొన్నిసార్లు కొన్ని సినిమాల‌ను చాలా తక్కువగా అంచనా వేస్తుంటారు. థియేటర్లలో ఫ్లాప్ అయ్యేసరికి టీవీలో కూడా ఆ సినిమాల‌ను ఎవరూ చూడర‌ని పక్కన పెట్టేస్తుంటారు. కానీ అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు సుబ్రమణ్యపురం సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సుమంత్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని సంతోష్ జాగర్లమూడి తెరకెక్కించాడు. డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం ఈ మధ్య జీ తెలుగులో ప్రసారం అయింది. విడుదలకు ముందే దాదాపు కోటిన్నర పెట్టి ఈ చిత్ర శాటిలైట్ తీసుకున్నారు జీ తెలుగు. ఫాంలో లేని సుమంత్ సినిమాను ఎవరైనా కోటిన్నర పెట్టి తీసుకుంటారా అంటూ జీతెలుగు పై సెటైర్లు కూడా పడ్డాయి. 

కానీ ఇప్పుడు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సుబ్రమణ్యపురం టీవీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తొలి సారి టీవీలో ప్లే చేసినప్పుడు ఏకంగా 7.8 టిఆర్పి రేటింగ్ తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో భారీ సినిమాలు కూడా ఈ స్థాయిలో తీసుకురాలేదు. అజ్ఞాతవాసి, ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు ఈ రేటింగ్ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు సుమంత్ మాత్రం సుబ్రమణ్యపురంతో మాయ చేశాడు. జీ తెలుగు పెట్టిన కోటిన్నర తొలిసారి ప్లే చేసినప్పుడు దాదాపు 70 శాతం వరకు తీసుకువచ్చిందని తెలుస్తోంది. దాంతో ఒకే నెలలో మరోసారి ఈ సినిమాను టీవీలో ప్లే చేయాలని చూస్తున్నారు. 

More Related Stories