English   

ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టీజర్ టాక్ !

Operation-Gold-Fish
2019-03-04 14:42:00

ప్రముఖ నటుడు సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్. వినాయకుడు, కేరింత సినిమాల దర్శకుడు సాయి కిరణ్‌ అడివి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. నువ్వు చేసిన తప్పు వల్ల కొన్ని ప్రాణాలు పోయాయంటూ సుపీరియర్ అధికారి ఆదిని తిడుతున్న డైలాగ్‌ తో టీజర్‌ మొదలైంది. కశ్మీర్‌ పాకిస్థాన్‌ది వెంటనే వదిలేసి వెళ్లిపోండి అంటూ పలువురు ఉగ్రవాదులు చేస్తున్న మరణ హోమాన్ని చూపించారు. చివర్లో ఓ భారతీయుడు ఎప్పుడూ ఇచ్చిన మాటను తప్పడని ఆది చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. దేశభక్తి థీమ్ కాబట్టి టీజర్ దాదాపు సీరియస్ గానే ఉంది.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫి కూడా బాగుంది. చయిత అబ్బూరి రవి ఈ చిత్రంతో నటుడిగా పరిచయమవుతూ తీవ్రవాది ఘాజీ బాబా పాత్రలో నటించారు. ఎన్‌ఎస్‌జి(నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌) కమాండో అర్జున్‌ పండిట్‌ పాత్రలో ఆది నటించారు. ఎయిర్టెల్ భామ సాషా చెత్రి, కార్తీక్‌రాజు, పార్వతీశం, నిత్యానరేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పాక్ తో కయ్యానికి భారత్ కాలు దువ్వుతున్న నేపధ్యంలో ఇలాంటి సినిమాలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. తెలుగులో పాక్ ఉగ్రవాదం మీద కొన్ని సినిమాలు చేసినా సాంకేతికంగా, క‌థ ప‌రంగా స‌రైన క‌స‌ర‌త్తులు చేయ‌క‌పోవ‌డం వ‌లన అవి అంతగా సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సినిమా ఏమి చేస్తుందో చూడలి మరి.

More Related Stories