తెలుగమ్మాయికి బంపర్ ఆఫర్ !

తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన మన తెలుగమ్మాయి శోభిత దూళిపాళ టాలీవుడ్ లో అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢాచారి సినిమాతో తెరంగ్రేటం చేసింది. ఆ సినిమాలో ఆమెకు మంచి రోల్ దొరకడంతో తనదైన నటన, అందంతో మెప్పించింది. ఆ సినిమా హిట్ కావడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావించారు కానీ ఆమెకు అనుకున్నంత అవకాశాలు ఏమీ రాలేదు. అయినా నిరుత్సాహ పడకుండా నెట్ ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకుని రెండు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. అయతే గూడచారి చూశారో వెబ్ సిరీస్ చూశారో తెలీదు కానీ ఆమెకు బాలీవుడ్ లో ఒక భారీ సినిమాకి ఆఫర్ రానే వచ్చింది. సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించనున్న లక్ష్మి అనే సినిమాలో శోభితకి హీరోయిన్ గా అవకాశం వచ్చిందని అంటున్నాటు. కాంచన 2కి రీమేక్ అయిన ఈ సినిమాని హిందీలో కూడా లారెన్స్ దర్శకత్వం వహించనున్నాడు. స్త్రీ, గోల్మాల్ 3 లాంటి హారర్ కామెడీ చిత్రాలకి భారీ విజయం లభించడంతో కాంచన2 రీమేక్ సెట్స్ మీదకు వెళుతోంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో విడుదలైన కొత్తలోనే రీమేక్ చేయాలని భావించినా అక్షయ్ 2.0 డేట్స్ సెట్ కాక ప్రాజెక్ట్ లేట్ అయింది. ఇప్పుడు ఆయన ఫ్రీ అయ్యాక ఈ సినిమా మీద ద్రుష్టి పెట్టారు.