English   

సుకుమార్ తో సినిమా ప్రకటించిన అల్లు అర్జున్ !

Allu-Arjun
2019-03-04 16:29:02

ఈ మధ్య కాలంలో ఏ సినిమా హిట్ అయినా ఆ సినిమా డైరెక్టర్ తో మహేష్ సినిమా అంటూ వార్తలు రావడం పరిపాటిగా మారిపోయింది. ఇక రంగస్థలం తర్వాత సుకుమార్, మహేష్ తో సినిమా చెయ్యడానికి కధ సిద్ధం చెయ్యడం మహేష్ కూడా అధికారికంగా సుక్కు సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగాయి. ఇక మధ్యలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా మహేష్ తో లైన్ చెప్పి ఒప్పించుకునేందుకు ప్రయత్నం చేసినా సందీప్ చెప్పిన కథ నచ్చక రీసెంట్ గా మహేష్ పక్కన పెట్టాడనే న్యూస్ నడిచింది. ఇక ఇక తాజాగా ఎఫ్ 2 డైరెక్టర్ అనిల్ రావిపూడితో మహేష్ సినిమా కన్ఫర్మ్ అంటూ వార్తలొస్తున్నాయి. అనిల్ రావిపూడితో మహర్షి సినిమా తర్వాతే సినిమా ఉండబోతుంది అంటూ వార్తలొస్తున్నాయి. మరోపక్క సుకుమార్ చెప్పిన కథకు మహేష్ కనెక్ట్ అవలేదని సుక్కుని కూడా మహేష్ హోల్డ్ లో పెట్టాడనే న్యూస్ కూడా విపరీతంగా ప్రచారం జరిగింది. వాటికీ ఊతం ఇచ్చేలాగా మహా శివరాత్రి కానుకగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించి ఫ్యాన్స్ ను సప్రైజ్ చేశాడు అల్లు అర్జున్. ఆయన తన 19 వచిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయనున్నాడని తెలిసిందే. ఇంకా ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లకముందే తన 20వ సినిమా తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ సుక్కూతో ఉండబోతుందని ప్రకటన చేశాడు. ఇంతకు మునుపు సుకుమార్, బన్నీ కలయికలో ఆర్య , ఆర్య2 సినిమాలు తెరకెక్కాయి. అలా ఈ సినిమా బంనీకి మూడోది, అలాగే బన్నీ కి త్రివిక్రమ్ తో కూడా ఇది మూడో సారి కావడం విశేషం.

More Related Stories