English   

న‌వ్విస్తూ ఆస్తులు పెంచుకుంటున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.. 

Anil-Ravipudi
2019-03-04 17:13:59

నవ్వడం ఒక యోగం.. నవ్వించడం ఒక భోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు జంధ్యాల. ఇప్పుడు ఇదే దారిలో వెళుతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రతి సినిమాలో నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతున్నాడు ఈ దర్శకుడు. చేసిన నాలుగు సినిమాల్లో కూడా నవ్వులు ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. తొలి మూడు సినిమాల్లో యాక్షన్ తో పాటు నవ్వులున్నాయి. కానీ నాలుగో సారి మాత్రం పూర్తిగా కామెడీ సినిమాతో వచ్చాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 140 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించాడు అనిల్ రావిపూడి. ఈయన తెరకెక్కించిన ఎఫ్2 సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు కూడా చిత్ర యూనిట్ ను సన్మానించాడు. తనకు ఇంత పెద్ద విజయాన్ని అందించిన దర్శకుడికి.. ఆయన డిపార్ట్మెంట్ కు ప్రత్యేక బహుమతులు ఇచ్చాడు దిల్ రాజు.  సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసిన ప్రతి ఒక్కరికి కాస్ట్ ఐ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు దిల్ రాజు. ఇక ఈ విజయానికి మూల పురుషుడు అయిన అనిల్ రావిపూడికి మాత్రం ప్రత్యేకంగా ఒక బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అది ఏంటి అనేది మాత్రం చెప్పడం లేదు ఈ దర్శకుడు. కానీ రాజు మాత్రం చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు. కార్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అనిల్ రావిపూడి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను అంటున్నాడు అనిల్. ప్రస్తుతం ఈయ‌న‌ మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేస్తున్నాడు. జూన్ నుంచి సినిమా పట్టాలెక్కనుంది.

More Related Stories