English   

పెళ్లి మీద క్లారిటీ ఇచ్చిన నగ్మా !

Nagma
2019-03-04 10:28:41

90వ దశకంలో టాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాది సినీ రంగాన్ని హీరోయిన్ నగ్మా కొన్నాళ్ళ పాటు ఏలిందనే చెప్పాలి. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా చాన్నాళ్ళ పాటు సక్సెస్ ఫుల్ నటిగా కొనసాగింది. అయితే ఆమె సినిమాలు తగ్గించి రాజకీయాల మీద ద్రుష్టి పెట్టింది. అలాగే ఆమె 45 ఏళ్ల వయసు వచ్చినా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇటీవలే మీడియాతో చేసిన చిట్ చాట్ లో ఎవరో విలేఖరి మీ పెళ్లి ఎప్పుడని అడగగా  నగ్మా చాలా గడుసుగా సమాధానం ఇచ్చింది. పెళ్లి ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుందని చెప్పింది. ఎవరికైనా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది ? అసలు జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని దేవుడు ముందే రాసి పెడతాడు. దాన్ని నేను డిసైడ్ చేయలేనని చెప్పింది. అలా తన పెళ్లి గురించి తాను నిర్ణయించాల్సినది ఏముందంటూ ఎదురు ప్రశ్నించింది. అయితే నగ్మా వివాహం చేసుకోక పోయిన ఆమె సోదరి జ్యోతిక నటుడు సూర్యను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వీరిది ఆదర్శ జంట.

More Related Stories