English   

తెలుగుదేశం కోసం ప‌ని చేస్తున్న బోయ‌పాటి శ్రీను..

Boyapati-Srinu
2019-03-04 11:06:00

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ విషయం అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా ఇప్పుడు కాదు.. జూన్ నుంచి పట్టాలెక్కబోతుంది. అప్పటి వరకు ఆయన ఎన్నికల‌తో బిజీగా ఉంటాడు. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఇదే ఎన్నికలతో బిజీ కావాలని చూస్తున్నాడు. కొంపతీసి ఈయ‌న రాజకీయాల్లోకి వస్తున్నారేమో అనుకోవ‌ద్దు. ఎందుకంటే ఆయ‌నకు రాజకీయాలు పెద్దగా తెలియవు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ యాడ్స్ తెరకెక్కించే బాధ్యత చంద్రబాబు నాయుడు ఈ దర్శకుడికి అప్పగించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాలను బోయపాటి శ్రీను తెరకెక్కించాడు. 

అప్పట్లో పుష్కరాల సమయంలో టీవీలో వచ్చిన యాడ్స్ తెరకెక్కించింది బోయపాటి శ్రీనే. దాంతో అదే న‌మ్మ‌కంతో మరోసారి ఇదే దర్శకుడిని నమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు ఉపయోగపడేలా కొన్ని కాన్సెప్టులు సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే ఈ దర్శకుడికి ముఖ్యమంత్రి సూచించారు. అల్లరి రవిబాబు కూడా కొన్ని కాన్సెప్ట్ లు సిద్ధం చేశాడు. కానీ బాబుగారి దృష్టి మాత్రం బోయపాటి శ్రీను పైనే ఉందని తెలుస్తోంది. ఈయనతోనే పార్టీ యాడ్స్ అన్ని చిత్రీకరించాల్సిందిగా పార్టీ వర్గాలను ఇప్పటికే చంద్రబాబు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతుంది. దాంతో కూడా ఇప్పుడు ఇదే పనిలో బిజీగా ఉన్నాడు. ఎన్నికల అయిపోయిన తర్వాత బాలకృష్ణ సినిమాతో బిజీ కానున్నాడు ఈ దర్శకుడు.

More Related Stories