English   

అమితాబ్ బ‌చ్చ‌న్ కు కార్ అమ్ముకోవాల్సిన క‌ష్ట‌మేమొచ్చింది..? 

Amitabh-Bachchan
2019-03-04 11:44:35

అమితాబ్ బ‌చ్చన్ కార అమ్మేసాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న న్యూస్ ఇది. బిగ్ బికి కార్ అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది.. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ వస్తుంది కదా అలాంటి సమయంలో ఎందుకు ఎలా అమ్ముకున్నాడు అనేది అందరికీ ఆశ్చర్యకరంగా మారింది. దీనికి కారణాలు మాత్రం తెలియడం లేదు. పైగా ఈయన తన సెంటిమెంట్ గా భావించే కారును అమ్మేశాడు. 2007లో ఏకలవ్య సినిమా విజయం సాధించినందుకు గాను  నిర్మాత విదు వినోద్ చోప్రా రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కార్ ను అమితాబ్ బచ్చన్ కు బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో ఆ కారు విలువ మూడున్నర కోట్లు. ఈ కారును తన గ్యారేజ్ లో చాలా ఇష్టంగా దాచుకున్నాడు అమితాబ్ బచ్చన్. ఎప్పుడు బయటికి వచ్చినా కూడా ముంబై వీధుల్లో ఆయనే సొంతంగా డ్రైవింగ్ చేస్తూ కనిపించేవాడు. అయితే ఇప్పుడు ఈ కారును ఇటీవల మైసూరు బిజినెస్ మ్యాన్ రుమన్‌ ఖాన్ సొంతం చేసుకున్నాడు. 

రుమన్‌కు ఇలాంటి లగ్జరీ కార్లను సేకరించడమంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే ఆయన గ్యారేజ్‌లో ఇలాంటి ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కారు కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం బిగ్‌బి గ్యారేజ్‌లో చాలా కార్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మెర్సిడెజ్‌-మేబ్యాక్‌ 5500, బెంట్లీ కాంటినెంటల్‌ జీటీ, ల్యాండ్‌ రోవర్‌, టొయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్సీ 200, పోర్షే కేమ్యాన్‌, రేంజ్‌ రోవర్‌ ఆటోబయోగ్రఫీ, ఆడీ ఏ8ఎల్‌, టొయోటా క్యామ్రీ, మిని కూపర్‌ కార్స్ ఆయన షెడ్డులో ఉన్నాయి. ఇన్ని కార్లు ఉండగానే ఈ మధ్యే లెక్సస్‌ ఎల్‌ఎక్స్‌ 570 ఎస్‌యూవీని కొన్నాడు అమితాబ్ బచ్చన్. 73 ఏళ్ల వయసులో కూడా వరస సినిమాలు చేస్తున్నాడు బిగ్ బి. ప్రస్తుతం 'బద్లా', 'బ్రహ్మాస్త్ర' చిత్రాలతో బిజీగా ఉన్నారు అమితాబ్ బచ్చన్. వీటితో పాటు తెలుగులో చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలోనూ న‌టిస్తున్నాడు మెగాస్టార్.

More Related Stories