English   

మ‌హేష్ బాబు కోసం అంతా సిద్ధ‌మే అంటున్న అనిల్.. 

Mahesh-Babu
2019-03-04 19:07:58

ఎఫ్2 మత్తులోంచి అనిల్ రావిపూడి మెల్ల మెల్లగా బయటికి వస్తున్నాడు. ఈయన తన తర్వాత సినిమాలో దృష్టి పెడుతున్నాడు. లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలి అనుకున్న కూడా స్టార్ హీరో పిలిచి ఆఫర్ ఇస్తే మాత్రం అటు వైపు వెళ్తారని ముందే చెప్పాడు ఈ దర్శకుడు. ఇప్పుడు చెప్పినట్లుగానే చేస్తున్నాడు అనిల్. మహేష్ బాబు లాంటి హీరో నుంచి పిలుపు రావడంతో అన్ని మానేసి కొని ఆయన కోసం కథ సిద్ధం చేయడంలో బిజీ అయిపోయాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈయన తర్వాత సుకుమార్ లైన్ లో ఉన్నా కూడా ఆయన ఇంకా కథ సిద్ధం చేయకపోవడంతో ఈ గ్యాప్ లో అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు మహేష్ బాబు. పైగా దూకుడు, ఆగడు సినిమాలకు పనిచేసిన అనుభవం మహేష్ బాబుకు ఉంది. 

శ్రీనువైట్లతో పని చేస్తున్నప్పుడే అనిల్ రావిపూడి టాలెంట్ గురించి మహేష్ బాబుకు పూర్తిగా తెలుసు. దూకుడు సినిమాలో ఎమ్మెస్ నారాయణ మొత్తం రాసింది అనిల్ రావిపూడే.. ఆ తర్వాత ఆగడులో కూడా మంచి కామెడీ సీన్స్ రాసాడు. ఈ నమ్మకంతోనే ఇప్పుడు తన సినిమా ఇచ్చేస్తున్నాడు సూపర్ స్టార్. జూన్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కబోతుంది. ఏకే ఎంటర్టెన్మెంట్స్తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ముందు ఇందులో దిల్ రాజు భాగం కాదు.. కానీ అనిల్ రావిపూడి దర్శకుడు కాబట్టి కచ్చితంగా విజయం సాధిస్తుందని తెలిసి ఈయన కూడా భాగస్వామిగా మారాడు. ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. దీనికి వాట్సాప్ అనే ట్రెండింగ్ టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

More Related Stories