English   

రాజీవ్ కనకాలకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారట !

Rajiv Kanakala play key role in Sai Srinivas Bellamkonda
2019-03-05 01:52:54

తెలుగు ఇండస్ట్రీలో నటులు లేరు అందుకే పక్క ఇండస్ట్రీల నుంచి కోట్లకు కోట్లిచ్చి మరీ కారెక్టర్‌ ఆర్టిస్టులను, విలన్లను దింపి మార్కెట్ చేస్తూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. కానీ మన దగ్గర ఉన్న నటులు మాత్రం దర్శక నిర్మాతలకు కనిపించరు. ఎందుకంటే ఎంతసేపూ పొరుగింటి పుల్లకూరే రుచి అనే సామెత ఉండనే ఉంది కదా. ఇప్పటి దాకా నేను చెప్పింది రాజీవ్ కనకాల గురించే. ఈయన ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈరోజుకీ రాజీవ్‌ కు తెలుగులో దక్కాల్సిన గుర్తింపు దక్కిందా అంటే ఆలోచనలో పడతాం. రాజీవ్‌ కనకాలను ఇప్పటి వరకు మన దర్శకుడు ఒక్కరైనా సరిగ్గా వాడుకున్నారా అంటే రాజమౌళి కాస్త వాడుకున్నాడనే చెప్పాలి. అయితే ఆయన కూడా ఈ మధ్య ఎందుకో రాజీవ్ ని పక్కన పెట్టాడు అనిపిస్తోంది. ఇప్పుడీ విషయం ఎందుకు చెబుతున్నా అంటే, తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తమిళ రాచ్చసన్ ని తెలుగులో రైడ్ మూవీ డైరెక్టర్ రమేష్ వర్మతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ షూట్ ఇప్పుడు హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో రాజీవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడట, ఆయన చేసిన ఒక ఎమోషనల్ సీన్ కు ఫిదా అయిన యూనిట్ మొత్తం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిందట. ఒక ఎమోషనల్ సీన్ లో గుండెలు పిండేలా చేసిన నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అయితే రాచ్చసన్ తమిళ సినిమా చూసిన వారికి అది ఏమి సీనో అర్ధం అవ్వచ్చుకానీ, ఆయన పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది.

More Related Stories