English   

కోటలో శివపూజలో రామ్ చరణ్ !

Ram-Charan
2019-03-05 09:24:14

నిన్న మహా శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో శివుణ్ని పూజించారు. సామాన్యులే కాక సెల‌బ్రిటీలు కూడా శివ‌ పూజలలో మునిగి తేలారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా భక్తి శ్రద్ధలతో స్వయంగా శివలింగానికి పూజలు చేశారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న దోమ‌కొండ సంస్థానానికి చెందిన కోటకు వెళ్ళి అక్క‌డ ఉన్న శివాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. తెలుగు సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌యిన పంచెకట్టుతో గ‌ర్భ‌గుడిలోకి వెళ్లిన చెర్రీ స్వ‌యంగా నీటితో శివ‌లింగాన్ని క‌డిగి పూజ‌లు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలని ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. దోమ‌కొండ శివాల‌యం యొక్క విశిష్ట‌తని కూడా చెప్పుకొచ్చింది ఉపాసన. కాకతీయుల కాలంలో 800 ఏళ్ల క్రితం దోమకొండ కోటను నిర్మించగా కోటలోని శివాలయాన్ని 400 ఏళ్ల క్రితం తమ పూర్వీకులు కట్టించారని చరణ్ భార్య ఉపసాన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సంస్థానానికి బిక్కనవోలు సంస్థానమని కూడా పేరుంది. చెర్రీ, ఉపాస‌న పెళ్ళి వేడుక‌లు కూడా ఈ కోట‌లోనే జరిగాయండోయ్.

More Related Stories