English   

మా ఎన్నికల్లో చిరంజీవి, మహేష్ బాబు..

Chiranjeevi
2019-03-05 03:20:28

మా ఎన్నికల వేడి మళ్ళీ మొదలైంది. ఈసారి ఇంకాస్త ఎక్కువగా ఘాటుగానే ఎలక్షన్స్ జరిగేలా కనిపిస్తున్నాయి. ఓవైపు రాజశేఖర్ వర్గం మరోవైపు శివాజీరాజా వర్గం ఎవరికి వారు విడిపోయి ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ నరేష్ ఈసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో శివాజీరాజా అధ్యక్షుడిగా పోటీ చేశారు కాబట్టి ఈసారి చేయకూడదంటూ ఆయన కొత్త నిబంధన తీసుకొచ్చాడు. ఒకరు ఒక సారి మాత్రమే అధ్యక్షుడిగా ఉండాలని.. శివాజీరాజా గత ఎన్నికల్లో అది అయిపోయింది కాబట్టి ఈ సారి తాను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను అంటున్నారు సీనియర్ నరేష్. దానికితోడు నిధుల దుర్వినియోగం కింద ఆ మధ్య శివాజీ రాజాపై సంచలన ఆరోపణలు చేశాడు సీనియర్ నరేష్. దాంతో ఇప్పుడు ఈ రెండు వర్గాల మధ్య హీట్ తారాస్థాయికి చేరింది. తమ ఎన్నికల కోసం మెగాస్టార్, సూపర్ స్టార్ ఇలా స్టార్స్ అందర్నీ వాడేస్తున్నారు సీనియర్ నరేష్. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసి తమకు మద్దతు తెలపాల్సిందిగా రాజశేఖర్ దంపతులతో పాటు సీనియర్ నరేష్ కూడా వెళ్ళాడు. ఇప్పుడు చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనను కూడా ఎన్నికలకు మద్దతు తెలపాల్సిందిగా కోరాడు రాజశేఖర్. ఆయనతో పాటు జీవిత రాజశేఖర్, నరేష్ కూడా ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో తమ వర్గానికి మద్దతు తెలిపి గెలిపించాల్సిందిగా కోరారు. మొత్తానికి మార్చి 10 న జరగబోయే మా ఎలక్షన్స్ ఈ సారి కూడా ఏదో కొత్త రచ్చ కు తెర తీసేలా కనిపిస్తున్నాయి.

More Related Stories