English   

మజిలీ లో రెండు విభిన్న పాత్రల్లో చైతూ !

Naga-Chaitanya
2019-03-05 03:33:04

నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఏ మాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం వంటి సినిమాల్లో ఈ జంట కలిసి నటించగా ఒక సినిమా బోల్తా కొట్టినా మరో రెండు సినిమాలు ఆడాయి, దీంతో ఈ సినిమా కూడా ఆడుతుందనే భావనలోనే ఉన్నారు. బాలీవుడ్ భామ దివ్యాంక కౌశిక్ రెండో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో చైతు గెటప్ ఆసక్తికరంగా ఉంటుందట. ఈ సినిమాలో పూర్ణ అనే మధ్య తరగతి భర్త పాత్రలో నాగచైతన్య కనపడతారట. ఈయన పాత్ర కొత్తగా ఉంటుదని చెబుతున్నారు. అలాగే ఆయన భార్య శ్రావణిగా సమంత కనపడనుంది. అయితే ఈ సినిమాలో చైతూ రెండు విభిన్న గెటప్‌ లలో ప్రేక్షకులని అలరిస్తాడని చెబుతున్నారు. యువకుడిగానూ తర్వాత మధ్య వయస్కుడిగానూ కనిపిస్తాడని అంటున్నారు. అయితే టీజర్ ను బట్టి చైతూ యువకుడిగా ఉన్నప్పుడు దివ్యాంశతో లవ్ లో బ్రేకప్ అయ్యి, పెద్దలు కుదిర్చిన సమంతను పెళ్లి చేసుకుంటాడు అన్నమాట. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అనేక ఫ్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న చైతూకి ఈ సినిమా హిట్ కావడం చాలా ముఖ్యం, చూడాలి మరి ఈ జంటను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో ? గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More Related Stories