English   

మహేష్ బాబుకు సుకుమార్ తో ఎందుకు అంతగా చెడిపోయింది..

Mahesh
2019-03-05 03:43:58

ముందు నుంచి అనుకున్నట్టుగానే మహేష్ బాబు-సుకుమార్ సినిమా ఆగిపోయింది. పట్టాలెక్కకుండానే ఈ సినిమా అటకెక్కింది. కారణాలు కూడా ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు సూపర్ స్టార్. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సుకుమార్ తో తాను చేయాల్సిన సినిమా ఆగిపోయిందని.. ఆయన చేయాలనుకుంటున్న కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు సూపర్ స్టార్. 

ఇప్పటికే మహేష్ బాబు కోసం రెండు కథలు సిద్ధం చేసిన కూడా ఆయనకు పెద్దగా నచ్చలేదని వార్తలు వినిపించాయి. ఏదో ఒక కథ సూపర్ స్టార్ కచ్చితంగా ఓకే చెబుతాడులే అని అభిమానులు కూడా నమ్మారు. కానీ ఎవరూ ఊహించని విధంగా సుకుమార్ చెప్పిన కథ నచ్చక పోవడంతో ఆయననే పూర్తిగా పక్కన పెట్టేసాడు మహేష్ బాబు. ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు మహేష్. సుకుమార్ ను పక్కన పెట్టి అనిల్ రావిపూడిని లైన్ లోకి తీసుకొచ్చాడు. జూన్ నుంచి ఈ చిత్రం పట్టాలు ఎక్కబోతుంది. మరో వైపు మహేష్ బాబు కాదనడంతో అల్లు అర్జున్ తో ఇదే కథను చేయబోతున్నాడు సుకుమార్. ఆయన 20వ సినిమాను సుకుమార్ తెరకెక్కించబోతున్నాడు. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. 

ఆర్య, ఆర్య 2 తర్వాత మూడోసారి సుకుమార్, అల్లు అర్జున్ కలిసి సినిమా చేయబోతున్నారు. దాంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఇది పూర్తయిన తర్వాత సుకుమార్ సినిమాతో బిజీ కానున్నాడు. అంటే ఎటు చూసుకున్న మరో ఎనిమిది నెలల వరకు సుకుమార్ మరో సినిమా చేయడన్నమాట. అప్పటి వరకు అల్లు అర్జున్ కోసం వేచి చూడడం తప్ప మరో ఆప్షన్ కూడా లేదు. మరో వైపు మహేష్ బాబు మాత్రం సుకుమార్ తో వచ్చిన ఆ క్రియేటివ్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పడం లేదు. ఆయనతో పనిచేసిన నేనొక్కడినే తనకు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలి పోయిందని.. తన కెరీర్లో ఎప్పుడూ అది కల్ట్ క్లాసిక్ అంటూ ట్వీట్ చేశాడు మహేష్ బాబు. మరి భవిష్యత్తులో అయినా మళ్ళీ సూపర్ స్టార్ తో సుకుమార్ సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి.

More Related Stories