English   

ఆ బూతు సినిమాలు తెలుగులోకి కూడా తీసుకొస్తున్నారా..

90ML
2019-03-05 06:51:24

ఈ రోజుల్లో చిన్న సినిమా అంటే బూతు అని మారిపోయింది. అయితే కొన్ని సినిమాలు అద్భుతమైన కథలతో వస్తున్న కూడా మరి కొందరు దర్శకులు మాత్రం కలెక్షన్ల కోసం కేవలం బూతును మాత్రమే నమ్ముకున్నారు. తమిళనాట ఈ మధ్య అడల్ట్ కామెడ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. పేరున్న కూడా అందులో నటిస్తుండటంతో కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఈ మధ్య ఇలాంటి సినిమా ఒకటి అక్కడ విడుదలయింది. ఆ సినిమా పేరు 90 ఎం.ఎల్. బిగ్ బాస్ తో పాపులర్ అయిన ఒవియా ఇందులో హీరోయిన్ గా నటించింది. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ ఇది. జీవితాన్ని తమకు నచ్చినట్లుగా బతకాలి అనుకునే ఐదుగురు అమ్మాయిల కథ. ఇది దీన్ని కాస్త బోల్డ్ గా తెరకెక్కించాడు దర్శకుడు. అందులో భాగంగానే ముద్దు సన్నివేశాలతో పాటు హాట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు శింబు సంగీతం అందించడం విశేషం. ఈయన కూడా హీరోయిన్ ఓవియాతో కలిసి లిప్ లాక్ సీన్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళనాట మంచి వసూళ్లు సాధిస్తున్న 90 ఎం.ఎల్ సినిమాను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. అదే పేరుతో తెలుగులో కూడా అనువదిస్తున్నారు. దానికి తోడు మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిలిం ఇన్ తమిళనాడు అంటూ ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పోస్టర్లపై ఇది కనిపించడమే కాకుండా హాట్ హాట్ స్టిల్స్ కూడా విడుదల చేస్తున్నారు. త్వరలోనే తెలుగులో కూడా విడుదల కానుంది. ఇది తక్కువ కాదు అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. మొత్తానికి తమిళనాట సంచలనం సృష్టిస్తున్న 90ml తెలుగులో ప్రేక్షకులను ఎంతవరుకు ఆకట్టుకుంటుందో చూడాలి.

More Related Stories