English   

త్రివిక్రమ్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్

Pawan-Kalyan
2019-03-05 07:24:37

సినీ దర్శకుడు త్రివిక్రమ్ కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మధ్య ఉన్న స్నేహం ఎలాంటిదో దాదాపు అందరికీ తెలుసు. ఒకానొక సమయంలో పవన్ స్పీచ్ లు అన్నీ త్రివిక్రమే రాస్తాడని కూడా ప్రచారం జరిగింది. ఆఖరికి పవనే కల్పించుకుని అబ్బే అదేమీ లేదని  చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే తాజాగా నెల్లూరులో వైద్య విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పవన్  త్రివిక్రమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అందరికీ త్రివిక్రమ్ అంటే అంటే ఓ సినిమా దర్శకుడిగానే అందరికీ తెలుసని కానీ దర్శకుడి కంటే ముందుగా ఆయన ఒక అత్యున్నత విద్యావంతుడని చెప్పుకొచ్చారు. న్యూక్లియర్ ఫిజిక్స్ లో త్రివిక్రమ్ ఎమ్మెస్సీ చేశారని యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా అని పవన్ పేర్కొన్నారు. సినిమా అనేది ఒక గొప్ప రంగమని 24 క్రాఫ్టుల మీద అవగాహన ఉంటేనే చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించగలరని చెప్పారు. రచయితగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన త్రివిక్రమ్ మాటల మాంత్రికుడిగా ఫేమస్ అయ్యారు. పదునైన పంచ్ డైలాగులు, కామెడీ పంచులు రాయడంలో త్రివిక్రమ్ ఫేమస్ అయ్యాడు. నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ ముందుగా ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆ తర్వాత మాత్రం పలు విజయవంతమైన చిత్రాలని తెరకెక్కించారు. 

More Related Stories