English   

అజిత్ ఫస్ట్ లుక్ అదుర్స్ !

Nerkonda-Paarvai
2019-03-05 14:52:27

త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టించిన విశ్వాసం సినిమా ఎ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రాగా, సంక్రాంతి రేసులో ముందునిలబడి మంచి కలెక్షన్లు రాబట్టింది. అందుకే ఈ సినిమాని తెలుగులో కూడా అనువదించి రిలీజ్ చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బాగా ఆద‌రిస్తున్నారు. దీంతో తన తర్వాతి సినిమా మీద ద్రుష్టి పెట్టిన అజిత్ కాస్త దూకుడుగానే ముందుకు వెళ్తున్నాడు. ఆయన తర్వాత సినిమాగా పింక్ రీమేక్ ని లైన్ లో పెట్టాడు అజిత్. ఈ సినిమాని కార్తీతో ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాని బోనీకపూర్ నిర్మిస్తుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ చిత్రం అజిత్‌కి 59వ చిత్రం కాగా, ఇందులో త‌మిళ నేటివిటీకి అనుగ‌ణంగా ప‌లు మార్పులు చేస్తున్న‌ట్టుగా చెబుతున్నారు. నిన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో అజిత్ కోట్ వేసుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుండ‌గా శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి, అందేరా తరియంగ్‌లు బోనులో నిల్చొని ఉండడం కనిపిస్త్జోంది. ఒరిజిన‌ల్ వ‌ర్షెన్ ఫస్ట్ లుక్ లానే ఉన్న ఈ పోస్ట‌ర్‌ని రూపొందించి నెర్కొండ పార్వీ అనే టైటిల్‌ తో త‌మిళ వర్షెన్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. విద్యా బాలన్ కూడా చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు.  ఒరిజినల్ పింక్ ఇండస్ట్రీ హిట్ గా నిలవగా ఈ సినినిమా ఎలా ఉండబోతుందో మరి ?

More Related Stories