English   

బోయపాటి శ్రీనుతో సినిమా మరింత ఆలస్యం చేయనున్న బాలకృష్ణ..

Balayya
2019-03-05 16:28:57

ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ కు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సినిమా షాక్ నుంచి బయటికి రావడానికి బాలకృష్ణ చాలా సమయం తీసుకునేలా కనిపిస్తున్నాడు. దానికి తోడు ఎన్నికలు కూడా రావడంతో బోయపాటి సినిమాకు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ముందుగా అనుకున్నట్లు జూన్ లో కూడా ఈ సినిమా మొదలవడం కష్టమేనని తెలుస్తోంది. ఆగస్టులో బోయపాటి సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. అప్పటి వరకు ఈయనకు ఎదురుచూపులు తప్పవు. ఆ లోపు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాలను కొన్ని చూసుకుంటున్నాడు బోయపాటి శ్రీను. ఈయనకు ఈ బాధ్యతను అప్పగించాడు చంద్రబాబు నాయుడు. పార్టీ యాడ్స్ తెరకెక్కించాలని కోరేసరికి బోయపాటి కూడా ప్రస్తుతం ఇదే పనిలో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ పూర్తయిన తర్వాత బాలకృష్ణ సినిమా నెమ్మదిగా మొదలు పెట్టాలని చూస్తున్నారు బోయపాటి శ్రీను. ఇక కథ విషయంలో కూడా బాలకృష్ణ చాలా జాగ్రత్తగా కనిపిస్తున్నాడు. గతంలో మాదిరి ఒక లైన్ చెప్పి షూటింగ్ కు వెళ్దాం అంటే వినడం లేదు బాలయ్య. పూర్తిగా స్క్రిప్ట్ వచ్చిన తర్వాతే షూటింగ్ కు వెళ్దామంటూ బోయపాటి శ్రీనుకు ఈయన షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటు ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ కావడంతో బాలకృష్ణ షాక్ లో ఉన్నాడు. అదే సమయంలో అక్కడ రామ్ చరణ్ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో బోయపాటి శ్రీను కూడా కోలుకోలేని షాక్ లో ఉన్నాడు. దాంతో ఇప్పుడు ఇద్దరూ ఫ్లాపుల నుంచి బయట పడాలంటే ఖచ్చితంగా ఒక మంచి విజయం అందుకోవాల్సిందే. కాస్త ఎక్కువ సమయం తీసుకున్న పర్లేదు కానీ కచ్చితంగా హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నారు బాలకృష్ణ, బోయపాటి. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుంది. ముందుగా 2019లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసినా కూడా ఇప్పుడు 2020కి వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

More Related Stories