English   

రాజ్ తరుణ్ కు ఎక్కడో సుడి ఉంది.. దిల్ రాజు చాన్స్ ఇచ్చాడట..

Dil-Raju
2019-03-05 10:45:21

అసలే వరుస ఫ్లాపులతో ఎక్కడున్నాడో కూడా ప్రేక్షకులు మర్చిపోయే పరిస్థితికి వచ్చేసాడు కుర్ర హీరో రాజ్ తరుణ్. ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీకి వచ్చినా.. తర్వాత అదే ఊపు కొనసాగించడంలో పూర్తిగా విఫలం అయ్యాడు.  అసలు రాజ్ తరుణ్ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు పట్టించుకోవడం కూడా మానేశారు. దానికి తోడు వరుస పరాజయాలు పూర్తిస్థాయిలో ముంచేశాయి. గతేడాది ఈయన నటించిన లవర్ సినిమా డిజాస్టర్ కావడంతో పట్టించుకునేవాళ్లు కరువైపోయారు. దానికి ముందు రంగులరాట్నం, రాజుగాడు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. దిల్ రాజు నిర్మించిన లవర్ సినిమా కూడా అంచనాలు నిలబెట్టకపోవడంతో రాజ్ తరుణ్ పూర్తిగా నటన మానేసి దర్శకత్వం వైపు వెళ్తున్నాడనే వార్తలు వచ్చాయి. 

అయితే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ కు దిల్ రాజు ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని తెలుస్తోంది. ఈయన త్వరలోనే వెంకటేశ్వర బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. వరస డిజాస్టర్ లో ఉన్న రాజ్ తరుణ్ కు దిల్ రాజు ఆఫీస్ నుంచి సినిమా రావడం అనేది చిన్న విషయం కాదు.. కానీ వచ్చింది. ఐదేళ్ల కింద సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమా తెరకెక్కించిన కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఇప్పుడు రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా నిర్మించబోతున్నాడు దిల్ రాజు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో అయినా రాజ్ తరుణ్ కెరీర్ మళ్ళీ గాడిన పడుతుందో పడుతుందో లేదో చూడాలి.

More Related Stories