English   

అలీ ఇంట్లో కీలక డాక్యుమెంట్ మిస్సింగ్...ఏమిటబ్బా ?

Actor-Ali
2019-03-05 11:15:15

గత కొద్దిరోజులుగా కమెడియన్ అలీ రాజకీయాలలోకి యాక్టివ్ అవుతారన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆయన ఈరోజు బంజారా హిల్స్ ఏసీపీని కలిసి తన ఇంట్లో కీలక డాక్యుమెంట్ ఒకటి మిస్సయ్యిందని ఫిర్యాదు చేయడం రాజకీయ ప్రాముఖ్యతని సంతరించుకుంది. నిజానికి ఇరవై ఏళ్ల క్రితమే టీడీపీలో చేరిన అలీ అప్పటి నుండి అంత యాక్టివ్ గా లేరు, కానీ ఆయన గత కొద్దిరోజులుగా రాజకీయాల్లో యాక్టివ్ అవుదామని ప్రయత్నిస్తున్నాడు. ఆయన ముందుగా జగన్ తో ఎయిర్పోర్ట్ భేటీ కావడంతో ఆయన చేజారిపోకుండా టీడీపీ రంగంలోకి దిగి ఒక టికెట్ ఆఫర్ చేసింది. అయితే అలీ మాత్రం తనకు సామాజికవర్గ పరంగా కలిసొచ్చే గుంటూరు తూర్పు నియోజకవర్గ సీటు ఆశిస్తున్నాడు. ముందు ఆ సీటు కుదరదని చెప్పిన బాబు ఇప్పుడు ఆ సీటు ఇవ్వడనికి ఒప్పుకున్నారని ప్రచారం జరిగింది. దీనికి ఊతం ఇచ్చేలాగా అలీ రెండ్రోజుల క్రితమే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు కోసం దరఖాస్తు రిటర్నింగ్ అధికారికి చేసుకున్నారట. ఆ ధరఖాస్తును పరిశీలించిన రిటర్నింగ్ అధికారి హైదరాబాద్‌లో ఉన్న ఓటును గురించి ప్రస్తావించగా అక్కడి ఓటును తొలగించి అయినా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని కోరారట. దీంతో ఓటు నమోదుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైనట్లు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఆలీ పోగొట్టుకున్న ఆ కీలక డాక్యుమెంట్ ఏమిటా ? అనే అనుమానాలు మొదలవుతున్నాయి. అలీ రాజకీయంగా యాక్తివ్ కావడానికి ఈ డాక్యుమెంట్ కి ఏమైనా సంబంధం ఉందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీని మీద అలీ స్పందిస్తే కానీ ఏమీ చెప్పలేం. 

More Related Stories