English   

ప్రభాస్ చెంప మీద కొట్టిన లేడీ ఫ్యాన్ !

Prabhas
2019-03-05 11:53:58

బాహుబ‌లి సినిమాతోప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమోగిపోయింది. ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే, అందునా లేడీస్ ఫ్యాన్స్ మరీ ఎక్కువ. చాలా మంది అమ్మాయిలు ప్రభాస్ ని తమ గ్రీకు వీరుడిలా భావిస్తూ ఉంటారు. అది స్వదేశంలో ఉండేవారయినా, విదేశంలో ఉండేవారయినా ప్రభాస్ అంటేనే ఆ క్రేజ్ వేరు. అలాంటిది ఒక సారిగా ప్రభాస్ ఎదురుపడితే ఎవరైనా ఏమి చేస్తారు ఆనడంతో ఉబ్బి తబ్బిబ్బు అయి ఒక సెల్ఫీ తీసుకుని మురిసిపోతారు. కానీ ఒక లేడీ ఫ్యాన్ మాత్రం చెంప చెళ్ళు మనిపించింది. సీరియస్ గా కాదండోయ్ ముద్దుగా, ప్ర‌స్తుతం సాహోతో పాటు జిల్ ఫేం రాధా కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్‌ షూట్ లో బిజీగా ఉన్నాడు ప్ర‌భాస్‌. అయితే సాహో షూట్ కోసం ఇటీవ‌ల‌ లాస్ ఏంజెల్స్ వెళ్ళారు. అక్క‌డ ఎయిర్ పోర్ట్‌లో ప్ర‌భాస్‌ని చూసిన ఫ్యాన్స్ ఆయ‌న‌తో ఫోటో దిగేందుకు ప‌రుగులు తీసారు. ఓ అమ్మాయి ప్ర‌భాస్‌తో ఫోటో దిగిన వెంట‌నే ఎగిరి గంతులు వేస్తూ ప్ర‌భాస్ చెంపని ముద్దుగా తడుముతూ పారిపోయింది. దీంతో ఒక్క‌సారి షాక్ అయ్యారు ప్ర‌భాస్‌ వెంటనే తడుముకుని ఆమెతో వచ్చిన మిగ‌తా అభిమానులతో ఫోటోలు దిగి వారిని ఉత్సాహ పరిచారు.  
 

More Related Stories