English   

అల్లు శిరీష్...యమా క్యూటు గురూ !

Allu-Sirish
2019-03-05 19:42:03

గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయిన అల్లు శిరీష్ ఇప్పటివరకు ఐదు సినిమాలు చేసినా ఒక్క డీసెంట్ హిట్ కూడా మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. అయితీ ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలని ఆయన చాలా గ్యాప్ తరువాత ఏబీసీడీ అనే కన్నడ రీమేక్ సినిమా చేస్తున్నాడు. మలయాళంలో ఘన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమాని సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కిస్తున్నారు. అల్లు శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ద ఫేం రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. "ముంతకల్లు చేతబట్టి తాగుతుంటే నువ్వెత్తి .. ఒళ్లంతా మత్తెక్కి ఊగిపోదా ఓరబ్బీ .. జట్టుకట్టిపోదామా .. స్వర్గమే చూద్దామా .. చుక్కలన్నీ చుట్టీ దిగి కిందికి వద్దామా " అంటూ సాగే పాటను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు. కల్లు దుకాణం నేపథ్యంలో సాగే ఈ పాటని వింటుంటే ఇది ఖచ్చితంగా ఐటెం సాంగ్ అనే అనుకుంటున్నారు. జుడా శాండీ అందిచిన సంగీతం బాగుంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ పాట మాత్రం ఆదరకొట్టిందనే చెప్పాలి. మరోపక్క మనోడు రెడ్ మ్యాగజిన్ కవర్ మీద మెరిశాడు. ఈ కవర్ పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేశాడు. రెడ్ మ్యాగజైన్ మార్చ్ ఎడిషన్ కవర్ పిక్ మీద ఉన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ ఫొటోలో డెనిమ్ సూట్ వేసుకున్న శిరీష్ యాపిల్ వాచ్ తో  స్టైలిష్ గా అంతకన్నా క్యూట్ గా కనిపిస్తున్నాడు. ఇక మధుర శ్రీధర్, విజయ్ దేవరకొండ మేనమామ యశ్ రంగినేని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలనటుడిగా సినిమాలు చేసిన మాస్టర్ భరత్ ఈ చిత్రంలో కీలకపాత్రలో కన్పించనున్నాడు.  అలాగే ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సంస్థ ఎఫ్ 2 సినిమాని అక్కడ రిలీజ్ చేసి భారీ లాభాలను రాబట్టుకుంది. 

More Related Stories