English   

జబర్దస్త్ యాంకర్ పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

Sri-Reddy
2019-03-06 08:01:38

శ్రీ రెడ్డి పేరు వినగానే మనకు రచ్చ గుర్తుకొస్తుంది. ఎప్పుడూ ఎవరో ఒకరిపై నోరు వేసుకుని పడిపోతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. శ్రీరెడ్డి నోటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావాలంటే పల్నాటి యుద్ధం జరగాల్సిందే. ఎప్పుడూ ఎవరో ఒకరిని విమర్శించింది మీకు నిద్ర కూడా రాదు. అలాంటి శ్రీరెడ్డి ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయపై ప్రశంసల వర్షం కురిపించింది. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా కూడా ఇదే నిజం. పదేళ్ల కింద ఇద్దరు సాక్షి ఛానల్ లోనే తమ కెరీర్ మొదలు పెట్టారు. అప్పట్లో అక్కడ ఇద్దరు న్యూస్ రీడర్స్ గా చేరారు. ఆ తర్వాత శ్రీరెడ్డి సినిమాల వైపు వెళ్ళిపోయింది.. అనసూయ tv రంగం వైపు వచ్చింది. టెలివిజన్ రంగాన్ని చాలా తక్కువగా అంచనా వేశానని.. అందుకే ఆ వైపుగా అవకాశాలు వచ్చినా కూడా వెళ్ళలేదు అని చెప్పింది శ్రీరెడ్డి. అనసూయ మాత్రం కెరీర్లో సరైన నిర్ణయం తీసుకుంది అంటూ ప్రశంసించింది. పెళ్లి తర్వాత కూడా ఆమె తన కెరీర్ ను మార్చుకున్న తీరు చూసి అద్భుతంగా అనిపించిందని.. తనను చూసి చాలా సార్లు ఇన్స్పైర్ అయ్యా అని చెప్పింది శ్రీరెడ్డి. తాను చేస్తున్న ఉద్యమానికి కూడా అనసూయ అండగా నిలిచిందని.. ఫోన్ చేసి సపోర్ట్ చేసిందని గుర్తు చేసుకుంది శ్రీ రెడ్డి. అయితే అనసూయ వర్షన్ మాత్రం మరోలా ఉంది. అప్పట్లో ఈ ఉద్యమం కోసం తన పేరు తీసినందుకు శ్రీరెడ్డిపై సీరియస్ అయ్యింది అనసూయ. నువ్వు చేసే ఉద్యమంలో నా పేరు ఎందుకు బయటకు తీస్తున్నావంటూ బాహాటంగానే అప్పట్లో శ్రీ రెడ్డిపై చిందులేసింది జబర్దస్త్ యాంకర్. కానీ ఇప్పుడు మాత్రం శ్రీరెడ్డి జబర్దస్త్ బ్యూటీపై ప్రశంసల వర్షం కురిపించింది. మొత్తానికి ఈ ఇద్దరి రిలేషన్ చూస్తుంటే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.

More Related Stories